Viral Video: అల్లు అర్జున్‌‌పై రష్మిక ఫైటింగ్.. ఈ AIతో ఇంకెన్ని దారుణాలు చూడాలో

Rashmika and Allu arjun fighting AI video goes viral: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రూపు రేఖలు మొత్తం మారిపోయాయి.

Update: 2024-12-29 09:30 GMT

Rashmika and Allu arjun fighting AI video goes viral: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ రూపు రేఖలు మొత్తం మారిపోయాయి. అన్ని రంగాల్లో ఈ టెక్నాలజీ వినియోగం ఇప్పుడు అనివార్యంగా మారింది. మనిషి శ్రమను తగ్గిస్తూ ఉత్పాదకతను పెంచుతోన్న ఏఐ కారణంగా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటున్నాయి. ముఖ్యంగా డీప్‌ ఫేక్‌ వంటి టెక్నాలజీతో దారుణాలు చూడాల్సి వస్తుంది. మార్ఫింగ్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో షేక్‌ అవుతోంది. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

అల్లు అర్జున్‌, రష్మిక జంటగా వచ్చిన పుష్ప2 భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని పీలింగ్స్‌ సాంగ్‌ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ, డ్యాన్స్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. అయితే ఈ వీడియోను ఏఐ సహాయంతో మార్ఫ్‌ చేశారు. రష్మిక మందన, అల్లు అర్జున్‌ ఢీ అంటే ఢీ అన్నట్లు కొట్టుకుంటున్నట్లున్న ఈ వీడియో నెటిజన్లు మొదట ఆశ్చర్యానికి గురి చేసినా ఆ తర్వాత అసలు విషయం తెలిసి నవ్వుకుంటున్నారు.

పీలింగ్స్‌ సాంగ్‌లో హీరోయిన్‌ కాలును హీరో తన చేతుల్లోకి తీసుకునే సీన్‌ ఉంటుంది. ఆ వీడియోను మార్ఫ్ చేసి తన్నుతున్నట్లు క్రియేట్ చేశారు. ఇక మరో సీన్‌లో రష్మిక మందన అల్లు అర్జున్ కాలును లాగుతున్నట్లు ఉంది. ఈ వీడియోను సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పోస్ట్ చేయగా తెగ వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను సుమారు 4 కోట్ల మంది చూడడం విశేషం. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు.

అచ్చంగా నిజంగానే ఉందని కొందరు స్పందిస్తే.. రానున్న రోజుల్లో ఏఐతో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని మరికొందరు అంటున్నారు. ఏదిఏమైనా ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప2 జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రూ. 1700 కోట్లు రాబట్టిన ఈ సినిమా బాహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్‌ చేసే దిశగా దూసుకుపోతోంది. వీకెండ్ కావడం, ఇయర్‌ ఎండ్‌ కూడా కావడంతో పుష్ప2 కలెక్షన్లను (Pushpa 2 movie total collections) మరింత పెరగడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Tags:    

Similar News