ఇంట్లోంచి 10 సార్లు పారిపోయి.. భర్తతో 15 రోజులు, ప్రియుడితో 15 రోజులు ఉండాలని షరతు!
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఒక వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. వివాహిత మహిళ ఓ విచిత్రమైన డిమాండ్‌తో గ్రామ పంచాయితీని షాక్‌కు గురి చేసింది.

ఆమె ఇప్పటికే తన భర్తను వదిలి 10 సార్లు తన ప్రియుడితో పారిపోయింది. ఈ క్రమంలో జరిగిన పంచాయితీలో, "నెలలో 15 రోజులు నా భర్తతో, మిగతా 15 రోజులు నా ప్రియుడితో గడపాలి" అని స్పష్టంగా ప్రకటించింది.
ఈ మాటలు విన్న గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె భర్త కూడా కన్నీళ్లతో "ఆమె ఎవరితో కావాలంటే వారితో ఉండనివ్వండి, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి" అని వేడుకున్నాడు.
మహిళ ఏడాదిన్నర క్రితం పొరుగు గ్రామానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ పెళ్లయిన కొద్దికాలానికే తాండా ప్రాంతానికి చెందిన మరో యువకుడితో సంబంధం పెట్టుకుంది. అప్పటి నుంచి పదే పదే అతనితో పారిపోతూ, తిరిగి భర్త ఇంటికే చేరుతోంది. మొత్తం 10 సార్లు ఇదే నాటకం పునరావృతమైంది.
ఇక చివరికి పంచాయితీ ముందు నిలబడి భర్త–ప్రియుడి మధ్య తన సమయాన్ని సమానంగా పంచుకోవాలని ప్రకటించడం అక్కడి వారిని తీవ్రంగా కలవరపరిచింది.