Raksha Bandhan 2022: రాఖీ పండుగ ఏ రోజున జరుపుకుంటే శుభప్రదం..!

Raksha Bandhan 2022: శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు.

Update: 2022-08-06 08:48 GMT

Raksha Bandhan 2022: రాఖీ పండుగ ఏ రోజున జరుపుకుంటే శుభప్రదం..!

Raksha Bandhan 2022: శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం ఆగస్ట్‌ 11వ తేదీ పౌర్ణమి వస్తోంది. అయితే ఈ రోజు రాఖీ పండుగ జరుపుకోవడానికి సమయం అనుకూలంగా లేదని పండితులు చెబుతున్నారు. దీంతో ఆగస్ట్‌ 12వ తేదీ జరుపుకోవాలని సూచిస్తున్నారు. దీనికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.

ఆగస్టు 11వ తేదీన పౌర్ణమి తిథి ఉదయం 10.39 గంటలకు ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ రోజున భద్ర కాలం ఉదయం నుంచి ప్రారంభమై రాత్రి 08:51 గంటలకు ముగుస్తుంది. హిందూ మతం ప్రకారం.. సాయంత్రం పూట ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోరు. అంతేకాదు రాత్రిపూట రాఖీ కట్టడం శభప్రదంగా భావించరు. అందుకే శుక్రవారం జరుపుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అయితే శుక్రవారం ఉదయం 7.05 గంటలలోపు సోదరులకు రాఖీ కట్టడానికి అనుకూల సమయమని పండితులు తెలిపారు. మీరు ఒకవేళ మీ సోదరులకి రాఖీ కట్టాలనుకుంటే శుక్రవారం ఉదయమే రాఖీ కట్టడం మంచిది. ఏడాదికి ఒక్కసారి వచ్చే రాఖీ పండగ కోసం సోదరిమణులు ఎంతగా ఎదురుచూస్తారో అందరికి తెలిసిందే.

Tags:    

Similar News