Women Rights Property: విడాకుల తర్వాత భార్యకు ఏ ఆస్తి హక్కులు ఉంటాయి?
Women Rights Property: భారతదేశంలో విడాకుల రేటు ఇతర దేశాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ఇది గణనీయంగా పెరిగింది.
Women Rights Property: విడాకుల తర్వాత భార్యకు ఏ ఆస్తి హక్కులు ఉంటాయి?
Women Rights Property: భారతదేశంలో విడాకుల రేటు ఇతర దేశాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో ఇది గణనీయంగా పెరిగింది. కొన్ని రాష్ట్రాల్లో, విడాకుల రేటు పది శాతానికి పైగా ఉంది. ముఖ్యంగా నగరాల్లో విడాకుల రేటు చాలా ఎక్కువ. ఉదాహరణకు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఇది 30% కంటే ఎక్కువని ఒక సంస్థ పేర్కొంది. మారుతున్న జీవనశైలి ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రేమించి పెద్దలను ఎదిరించి చేసుకున్న జంటలు కూడా అతి తక్కువ కాలంలోనే కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి. అయితే, విడాకుల తర్వాత భార్యకు ఏ ఆస్తి హక్కులు ఉంటాయి? అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
విడాకుల తర్వాత భార్యకు ఏ ఆస్తి హక్కులు ఉంటాయి?
*విడాకుల తర్వాత, భార్యాభర్తలు వివాహం సమయంలో కలిసి సంపాదించిన ఆస్తిపై మాత్రమే స్త్రీకి హక్కులు ఉంటాయి.
*భార్యాభర్తలిద్దరూ కలిసి ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసి ఉంటే, విడాకుల తర్వాత స్త్రీకి దానిపై హక్కు ఉంటుంది.
*భర్త పూర్వీకుల ఆస్తిపై స్త్రీకి ఎటువంటి హక్కులు ఉండవు.
*ఏదైనా ఆస్తిని భర్త స్వయంగా కొనుగోలు చేస్తే సాధారణంగా స్త్రీకి దానిపై ఎటువంటి హక్కు ఉండదు.
*భార్యాభర్తలిద్దరి పేరు మీద ఆస్తి కొనుగోలు చేసి ఉంటే విడాకుల తర్వాత కూడా స్త్రీకి అందులో వాటా ఉంటుంది.
*భార్య పేరు మీద ఏదైనా ఆస్తి కొనుగోలు చేసి ఉంటే విడాకుల తర్వాత ఆ ఆస్తిపై స్త్రీకి పూర్తి హక్కులు ఉంటాయి.
*భార్య పేరు మీద ఏదైనా ఆస్తి కొనుగోలు చేసి ఉంటే విడాకుల తర్వాత ఆ ఆస్తిపై స్త్రీకి పూర్తి హక్కులు ఉంటాయి.
*వివాహం సమయంలో స్త్రీ పుట్టింటి నుంచి తెచ్చిన ఆభరణాలు, ఆస్తిపై ఆమెకు అన్ని హక్కులు ఉంటాయి.
*విడాకుల తరువాత స్త్రీ తన భర్త నుండి జీవనాధారాన్ని పొందుతుంది. దీనిని కోర్టు నిర్ణయిస్తుంది.
*విడాకుల తర్వాత స్త్రీ ఆర్థికంగా స్థిరపడటానికి సహాయం చేయడమే జీవనభృతి ఉద్దేశ్యం.