Viral Video: వీళ్ల తెలివి తగలెయ్యా.. పాకిస్తాన్ ఏటీఎంలపై నెటిజన్ల ఫన్నీ రియాక్షన్..!
Pakistan ATM Viral Video: పాకిస్తాన్‌కి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.
Viral Video: వీళ్ల తెలివి తగలెయ్యా.. పాకిస్తాన్ ఏటీఎంలపై నెటిజన్ల ఫన్నీ రియాక్షన్..!
Pakistan ATM Viral Video: పాకిస్తాన్‌కి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. అక్కడి వాస్తవ పరిస్థితుల్ని చూపిస్తూ పాకిస్తానీయులు తీయడం, అక్కడి జీవన శైలిని చూపించే వీడియోలు నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి. బొమ్మ యుద్ధ విమానాలు, ఆకుపచ్చ తువ్వాళ్లు వేసుకుని ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణికులు బయటికి రావడం, నీటి కొరతపై ఫన్నీ స్కెట్లు… ఇలా రోజూ ఏదో ఒకటి ట్రెండింగ్‌లో ఉంటుంది.
అలాంటి వీడియోల్లో తాజాగా ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కరాచీకి చెందినదిగా చెబుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ఫోన్ కెమెరాతో ఏటీఎం రూమ్‌లోకి ప్రవేశించాడు. ఆ రూమ్ డోర్ తెరిచిన వెంటనే లోపల మరొక వ్యక్తి డబ్బులు తీసుకుంటూ కనిపించాడు. ఇంతవరకూ సాధారణమే. కానీ అసలు మ్యాటర్ ఇక మొదలైంది!
ఆ ఏటీఎం రూమ్‌లో ఏసీ మిషన్, సీసీ కెమెరాకు ఇనుప గ్రిల్లుతో తాళం వేసి పెట్టారు. అంటే దొంగలు ఏటీఎం మిషిన్‌కు కాదు, ఏసీ, సీసీ కెమెరాలే కొట్టేస్తారేమో అనిపించినట్టుంది! అందుకే సరిగ్గా వాటి చుట్టూ గట్టిగానే ఇనుప గ్రిల్ వేసి, పగడ్బందీగా తాళం వేసి కట్టేశారు.
ఈ సీన్ చూసిన నెటిజన్లు నవ్వులు ఆపుకోవడం లేదు. "ఏటీఎం మిషన్ ఖరీదు తక్కువేమో… కానీ ఏసీ, సీసీ కెమెరా మోతాదు ఎక్కువ అని అనిపిస్తుందిగా!" అంటూ కామెంట్లతో హల్‌చల్ చేస్తున్నారు. "దొంగలు వచ్చి ఏటీఎం వదిలేసి ఏసీ ఎత్తుకుపోతారేమో", "పాకిస్తాన్ లెవల్స్ అంటే ఇవేనా?" అంటూ సోషల్ మీడియాలో నిండా ట్రోల్ చేస్తున్నారు.
ఇది కొత్తేమీ కాదు… పాకిస్తాన్ నుంచి ఇలాంటి ఫన్నీ వీడియోలు తరచూ రావడం నెట్ జనాలకూ అలవాటే. కానీ ఏసీ, సీసీ కెమెరాలకు తాళం వేసిన ఈ సీనే మాత్రం అందరినీ అవాక్కు చేస్తోంది.