Viral video: వీడు డాక్టర్ ఎలా అవుతాడు? అందరూ చూస్తుండగానే 70 ఏళ్ల వృద్ధుడిపై దాడి

Old age man thrashed by doctor: తన భార్యకు చికిత్స చేయించేందుకు వచ్చిన ఒక 70 ఏళ్ల వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడి

Update: 2025-04-20 13:51 GMT

Viral video: వీడు డాక్టర్ ఎలా అవుతాడు? అందరూ చూస్తుండగానే 70 ఏళ్ల వృద్ధుడిపై డాక్టర్ పైశాచికం

Viral video of old age man thrashed by doctor: డాక్టర్ అంటే ప్రాణాలు నిలబెట్టేవారనే ఉద్దేశంతో వారిని దేవుడిని చూసినట్లు చూస్తారు. కానీ ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ డాక్టర్ మాత్రం ప్రాణాలు తీసే వాడిలా ఉన్నాడు. తన భార్యకు చికిత్స చేయించేందుకు వచ్చిన ఒక 70 ఏళ్ల వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అంతటితో విడిచిపెట్టకుండా ఆ వృద్ధుడిని హాస్పిటల్ బయటి వరకు లాక్కెళ్లి అక్కడే ఉన్న పోలీసు ఔట్ పోస్టులో అప్పగించాడు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రస్తుతం ఉన్నతాధికారుల నుండి విచారణ ఎదుర్కుంటున్నాడు.

వైద్య వృత్తికే మచ్చ తెచ్చే ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే... మధ్యప్రదేశ్ లోని ఛత్తర్ పూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఏప్రిల్ 17న ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు ఉద్ధవ్ సింగ్ జోషి తన భార్యకు చికిత్స చేయించేందుకు ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. పెద్ద క్యూ లైన్‌లో గంటల తరబడి నిలబడిన తరువాతే తన వంతు వచ్చిందని, అయినప్పటికీ తన సీరియల్ రాకుండానే వచ్చావంటూ డాక్టర్ తనపై దాడికి పాల్పడ్డాడని ఉద్ధవ్ సింగ్ వాపోయారు. తనను తన్ని, కొట్టి దాడికి పాల్పడ్డారని అన్నారు. మరో వ్యక్తితో కలిసి ఆస్పత్రి బయటివరకు ఈడ్చుకెళ్లారని తెలిపారు.

అయితే, ఈ ఘటనలో ఆస్పత్రి వర్గాల వెర్షన్ మరోలా ఉంది. వృద్ధుడు వరుసలో రానందువల్లే వాగ్వాదం జరిగిందని, ఆ తరువాతే డాక్టర్ రాజేశ్ మిశ్రా దాడికి పాల్పడ్డారని ఆస్పత్రి సివిల్ సర్జన్ డా జీ.ఎల్. అహిర్వార్ తెలిపారు. ఏదేమైనా ఒక డాక్టర్ వృద్ధుడిపై దాడికి పాల్పడని తీరును చూసి జనం తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో ఛతర్‌పూర్ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. 

Tags:    

Similar News