Numerology Tips: ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు ఊసరవెల్లి లాగా రంగులు మారుస్తారు..!

Numerology Tips: సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా అతని మూల సంఖ్య తెలుస్తుంది. దీని ఆధారంగా వ్యక్తి స్వభావం, జీవితంలో జరిగే విషయాల గురించి అంచనా వేయవచ్చు.

Update: 2025-06-05 11:30 GMT

Numerology Tips: ఈ తేదీలలో జన్మించిన వ్యక్తులు ఊసరవెల్లి లాగా రంగులు మారుస్తారు..!

Numerology Tips: సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా అతని మూల సంఖ్య తెలుస్తుంది. దీని ఆధారంగా వ్యక్తి స్వభావం, జీవితంలో జరిగే విషయాల గురించి అంచనా వేయవచ్చు. ఒక వ్యక్తి ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో మూల సంఖ్య సహాయపడుతుంది. అయితే, ప్రతి మూల సంఖ్య వెనుక ఒక నిర్దిష్ట గ్రహం ప్రభావం ఉంటుంది. ఈ గ్రహం కొన్ని విభిన్న లక్షణాలను ఇస్తుంది. ఈ విధంగా పుట్టిన తేదీ, దానితో సంబంధం ఉన్న మూల సంఖ్య కూడా వ్యక్తి భవిష్యత్తు గురించి సూచనలు ఇవ్వడంలో సహాయపడుతుంది. ఈ రోజు మనం మూల సంఖ్య 3, 4,8 ఉన్న వారు ఎలా ఉంటారు? వారి స్వభావం ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వారికి మూల సంఖ్య 3 ఉంటుంది. ఈ సంఖ్య వారిపై బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం, మూల సంఖ్య 3 ఉన్న వ్యక్తులు చాలా ఉల్లాసంగా ఉంటారు. కానీ, కొన్నిసార్లు ఈ వ్యక్తులు తమ బాధ్యతల నుండి తప్పుకుంటారు. అంతేకాకుండా, ఇష్టం వచ్చినట్లు వాగుతుంటారు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 4, 13, 22 లేదా 31 తేదీలలో జన్మించిన వ్యక్తులకు మూల సంఖ్య 4 ఉంటుంది. ఈ సంఖ్య పాలక గ్రహం రాహువు. సంఖ్య 4 ఉన్న వ్యక్తులు చాలా శక్తివంతులు. అలాగే గర్వంగా ఉంటారు. వారు చిన్న విషయాలకు చాలా త్వరగా కోపంగా పడతారు. అలాగే, ఈ వ్యక్తులు ఎవరితోనైనా సరే సంబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడరు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 8, 17, 26 తేదీలలో జన్మించిన వారి మూల సంఖ్య 8. 8ని శని దేవుడి మూల సంఖ్యగా పరిగణిస్తారు. ఈ వ్యక్తులు కొన్నిసార్లు మానసికంగా బలహీనంగా ఉండే పరిస్థితుల్లో చిక్కుకుంటారు. ఇది కాకుండా, వారు కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు.

Tags:    

Similar News