Post Office : పోస్టాఫీసులో ఇకపై క్యాష్ టెన్షన్ లేదు.. ఆగస్టు 2025 నుంచి డిజిటల్ పేమెంట్లు షురూ!

Post Office: ఆ మధ్య బ్యాంకులన్నీ డిజిటల్ పేమెంట్లకు మారిపోతే, పోస్టాఫీసులకు వెళ్లిన వాళ్లకు నగదుతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకపై ఆ చింత అవసరం లేదు. ఆగస్టు 2025 నుంచి మన పోస్టాఫీసులు తమ కౌంటర్లలో డిజిటల్ పేమెంట్లను తీసుకోవడం మొదలుపెడతాయట. అంటే, డబ్బులు లెక్కపెట్టి ఇచ్చే పని, చిల్లర లేదని గొడవ పడే పని ఇక ఉండదు.

Update: 2025-06-28 11:35 GMT

Post Office : పోస్టాఫీసులో ఇకపై క్యాష్ టెన్షన్ లేదు.. ఆగస్టు 2025 నుంచి డిజిటల్ పేమెంట్లు షురూ!

Post Office: ఆ మధ్య బ్యాంకులన్నీ డిజిటల్ పేమెంట్లకు మారిపోతే, పోస్టాఫీసులకు వెళ్లిన వాళ్లకు నగదుతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇకపై ఆ చింత అవసరం లేదు. ఆగస్టు 2025 నుంచి మన పోస్టాఫీసులు తమ కౌంటర్లలో డిజిటల్ పేమెంట్లను తీసుకోవడం మొదలుపెడతాయట. అంటే, డబ్బులు లెక్కపెట్టి ఇచ్చే పని, చిల్లర లేదని గొడవ పడే పని ఇక ఉండదు.

ఇది ఎలా సాధ్యం అవుతుందంటే.. పోస్టల్ డిపార్ట్‌మెంట్ కొత్తగా ఒక ఐటీ సిస్టమ్‌ను, ఒక ప్రత్యేక అప్లికేషన్‌ను అమలు చేస్తోంది. ప్రస్తుతం, పోస్టాఫీసుల్లో డిజిటల్ పేమెంట్లు తీసుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ల అకౌంట్లు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ కు లింక్ కాలేదు. కానీ, ఇప్పుడు పోస్టల్ డిపార్ట్‌మెంట్ తమ ఐటీ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేస్తోంది.

ఈ కొత్త సిస్టమ్‌లో ఒక స్పెషల్ అప్లికేషన్ ఉంటుందట. ఇది క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు పంపించడం, తీసుకోవడం చాలా ఈజీ చేస్తుందట. తెలిసిన వర్గాల ప్రకారం.. వచ్చే ఏడాది ఆగస్టు 2025 నాటికి దేశంలోని అన్ని పోస్టాఫీసుల్లో ఈ సిస్టమ్ పూర్తిగా అమలు అవుతుందని చెబుతున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలకు కూడా చాలా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.

ఈ కొత్త సిస్టమ్ టెస్టింగ్ ఇప్పటికే కర్ణాటక సర్కిల్‌లో మొదలైంది. మైసూరు, బాగల్‌కోట్ లోని ప్రధాన పోస్టాఫీసుల్లో, వాటి కింద ఉండే చిన్న ఆఫీసుల్లో క్యూఆర్ కోడ్ ద్వారా మెయిల్ ప్రొడక్ట్స్ బుక్ చేయడం సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఇది నిజంగా పోస్టల్ డిపార్ట్‌మెంట్ డిజిటల్ పేమెంట్ల వైపు వేస్తున్న ఒక పెద్ద అడుగు.

పోస్టల్ డిపార్ట్‌మెంట్ గతంలో కూడా డిజిటల్ లావాదేవీలు మొదలుపెట్టాలని ప్రయత్నించింది. అప్పుడు పోస్టాఫీసుల కౌంటర్ల దగ్గర స్టాటిక్ క్యూఆర్ కోడ్‌లు పెట్టారు. కానీ, తరచుగా టెక్నికల్ సమస్యలు రావడం, కస్టమర్ల నుంచి చాలా ఫిర్యాదులు రావడం వల్ల ఆ సౌకర్యాన్ని ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు కొత్త సిస్టమ్‌తో, పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. ఈ అడుగు పోస్టాఫీసులను మరింత ఆధునికంగా, కస్టమర్ ఫ్రెండ్లీగా మార్చడానికి సహాయపడుతుంది.

డిజిటల్ పేమెంట్ సౌకర్యం వల్ల కస్టమర్లు నగదు వెంట తీసుకువెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. చిన్న మొత్తాల చెల్లింపుల కోసం చిల్లర దొరకలేదనే ఇబ్బంది ఉండదు. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. కౌంటర్ల వద్ద నిరీక్షణ సమయం తగ్గుతుంది. ఇది భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా మిషన్‌కు కూడా బూస్ట్ ఇస్తుంది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ తీసుకున్న ఈ ప్రయత్నం కస్టమర్లకు సౌకర్యంగా ఉండటమే కాకుండా, పోస్టాఫీసుల పని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.

ఆగస్టు 2025 నాటికి ఈ సౌకర్యం మొదలైతే, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు పోస్టాఫీసుల్లో డిజిటల్ పేమెంట్ల ప్రయోజనాలను పొందగలుగుతారు. ఇకపై మనీ ఆర్డర్ చేయాలన్నా, పార్సిల్ పంపాలన్నా, పథకాల్లో డబ్బులు కట్టాలన్నా ఫోన్ ఉంటే చాలు.

Tags:    

Similar News