‘పెళ్లి,మనీ రెండూ వద్దు..’ అని సమాజానికి దూరంగా.. ఒక గుహలో జీవిస్తున్న యువకుడు
పెళ్లి వద్దు, డబ్బు వద్దు.. నాకు అంటూ ఒక 35ఏళ్ల యువకుడు జీవితంలో విసిగిపోయి ఒక గుహని తన ఇంటిగా మార్చుకుని జీవిస్తున్నాడు.
‘పెళ్లి,మనీ రెండూ వద్దు..’ అని సమాజానికి దూరంగా.. ఒక గుహలో జీవిస్తున్న యువకుడు
పెళ్లి వద్దు, డబ్బు వద్దు.. నాకు అంటూ ఒక 35ఏళ్ల యువకుడు జీవితంలో విసిగిపోయి ఒక గుహని తన ఇంటిగా మార్చుకుని జీవిస్తున్నాడు. ఇంట్లోనే పంటలు, వంటలు, పుస్తకాలు చదవడం,.. ఇలా విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. తన లైఫ్‌ని లీడ్ చేస్తున్నాడు. ఇతడి లైఫ్ స్టైల్ ని చూసి ఏకంగా సోషల్ మీడియానే ఫిదా అయిపోయింది. అందుకే అతగాడ్ని స్టార్ ని చేసేసింది. ఆ వివరాల్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చైనాలోని షిచువాన్ ప్రావిన్స్ కు చెందిన మిన్ హెంగ్‌కై అనే 35ఏళ్ల కుర్రాడ్ని సోషల్ మీడియా ఒక పెద్ద స్టార్‌ని చేసేసింది. మిన్ అంతకుముందు డ్రైవర్‌గా పనిచేసేవాడు. డబ్బులు కూడా బానే వచ్చేవి. అయితే వచ్చిన డబ్బులు ఇంటికి మాత్రమే సరిపోయేవి. ఇక అదనంగా ఏం కొనాలన్నా డబ్బులు సరిపోయేవి కాదు. ఇదిలా ఉంటే మరో పక్క తన తల్లిదండ్రులు పెళ్లిచేసుకోమని అడిగేవారు. ఒకవేళ చేసుకుంటే ఈ డబ్బులు ఎక్కడ సరిపోతాయి. ఇంకా ఏదైనా ఉద్యోగం చేయాలా? ఇలాంటి ప్రశ్నలన్నీ మిన్‌ని తెగ ఇబ్బంది పెట్టాయి. ఒకరోజు అంటే 2021లో తన ఉద్యోగాన్ని వదిలేసి ఇంటిని వెళ్లిపోయాడు. ఆ తర్వాత తన ఊరిలో ఉన్న ఒక చిన్న గుహలోకి మకాం మార్చాడు. ఆ గుహనే తన ఇంటిగా మలిచాడు. దానికి బ్లాక్ హోల్ అని పేరు పెట్టాడు. గుహలోలప మధ్యలో పడుకునేందుకు వీలుగా మంచం, స్నానం చేయడానికి ఒక పెద్ద టబ్, మురికి నీళ్లు పోడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇలా తనకు కావాల్సిన విధంగా, తన దగ్గర ఉన్న వస్తువులతో ఆ గుహను తన ఇంటికా మార్చుకున్నాడు. ఇక పెళ్లి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. డబ్బులు సరిపోతాయోలేదోనని భయపడాల్సింది లేదు అని మిని అంటున్నాడు.
పెళ్లి, ఉద్యోగం వంటి వాటికి దూరంగా ఉంటూ తన గుహలో కూరగాయలను పండించుకుంటున్నాడు. బోర్ కొడితే పుస్తకాలు చదువుతున్నాడు. మొత్తానికి బాధ్యతలను అన్నీ వదిలేసి ప్రశాంతంగా జీవిస్తున్నాడు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా మినిని మోడర్న్ కేవ్ మనీ అని పిలుస్తున్నారు. అతని లైఫ్ స్టైల్ ని చూసి నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు. లైఫ్ అంటే మినిదే.. అతనిలా ప్రతి ఒక్కరు ధైర్యం చేస్తే మంచి లైఫ్ స్టైల్ ని చూడొచ్చని చెబుతున్నారు.