Mango: కిలో మామిడి పండ్ల ధర రూ. 3 లక్షలు.. అంత ప్రత్యేకత ఏంటనేగా
Miyazaki Mango: పండ్లలో మామిడి పండుకు ఉండే ప్రత్యేకతే వేరు. వేసవి కాలం రాగానే మామిడిపళ్ల సీజన్‌ను ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
Miyazaki Mango: పండ్లలో మామిడి పండుకు ఉండే ప్రత్యేకతే వేరు. వేసవి కాలం రాగానే మామిడిపళ్ల సీజన్‌ను ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. భారతదేశంలో మామిడి పండ్లకు ఉన్న గిరాకీ వల్ల, ఇది కేవలం ఒక పండు మాత్రమే కాదుమన జీవన శైలిలో భాగంగా మారిపోయాయి.
అయితే భారత్‌లో వెయ్యికిపైగా రకాల మామిడి పండ్లు ఉత్పత్తి అవుతాయన్న విషయం మీకు తెలుసా. అందుకే, భారతదేశాన్ని 'మామిడి పండ్ల భూమి'గా పేర్కొంటారు. కానీ ఈ మామిడి పండ్లలో కొన్ని రకాలు ప్రపంచస్థాయిలోనే అత్యంత విలువైనవిగా పేరుగాంచాయి.
సాధారణంగా మార్కెట్‌లో ఒక కిలో మామిడి ధర రూ.100 నుంచి రూ.200 వరకు ఉంటుంది. అయితే కొందరు రైతులు విలువైన జాతుల మామిడిపండ్లను పెంచుతున్నారు. అలాంటి అత్యంత ఖరీదైన మామిడి జాతుల్లో "మియాజాకి" ఒకటి. ఈ మామిడి పండు ధర కిలోకు రూ. 2.5 నుంచి రూ. 3 లక్షల వరకు ఉండడం విశేషం. ఈ మామిడి జపాన్‌లోని మియాజాకి ప్రాంతంలో మొదటగా పండించారు.
ప్రకాశవంతమైన గులాబీ-ఎరుపు రంగు, మెత్తని, కరిగిపోయేలా ఉండే గుజ్జు, తీపి రుచి దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు. మియాజాకి పండును చాలా జాగ్రత్తగా పెంచుతారు. , కాంతి, గాలికి ప్రత్యేక రక్షణ కల్పిస్తారు. వీటిని అత్యంత ప్రీమియం మార్కెట్‌కి మాత్రమే సరఫరా చేస్తారు.
భారత్‌లోని కశ్మీర్, బీహార్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా మియాజాకి మామిడి పెంచుతున్నారు. ఈ పండ్ల తోటలకు భారీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీని ధరే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.