Viral Video: తలనే చెరువుగా మార్చిన తాత..నెత్తి మీద చేపల పెంపకం

Viral Video : నేటి కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చి జనాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పలేం.

Update: 2026-01-01 06:30 GMT

Viral Video: తలనే చెరువుగా మార్చిన తాత..నెత్తి మీద చేపల పెంపకం

 Viral Video : నేటి కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే పిచ్చి జనాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తుందో చెప్పలేం. లైకులు, వ్యూస్ కోసం కొందరు ప్రమాదకరమైన స్టంట్లు చేస్తే, మరికొందరు ఊహకందని వింత పనులు చేస్తున్నారు. తాజాగా ఇంటర్నెట్‌లో ఒక వీడియో నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ఒక వృద్ధుడు తన తలనే అక్వేరియం‎గా మార్చేశాడు. ఇంటి వరండాలోనో, హాల్లోనో ఉండాల్సిన ఫిష్ ట్యాంక్ ఇప్పుడు ఒక వ్యక్తి నెత్తి మీద దర్శనమిస్తోంది. ఈ వింత ప్రయోగాన్ని చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వృద్ధుడు కూర్చుని ఉండగా, అతని తల చుట్టూ ఒక పారదర్శకమైన ప్లాస్టిక్ కవర్‌ను అక్వేరియం ఆకారంలో అమర్చారు. అది నీరు లీక్ అవ్వకుండా తలకు గట్టిగా అతుక్కుని ఉంది. ఆ తర్వాత ఒక మహిళ వచ్చి ఆ ప్లాస్టిక్ ట్యాంక్‌లో నీళ్లు పోసి, అందులోకి చిన్న చిన్న రంగుల చేపలను వదిలేస్తుంది. ఆ చేపలు సంతోషంగా ఆ వ్యక్తి తల చుట్టూ ఈదుతుంటే, ఆ వృద్ధుడు మాత్రం ఏమీ ఎరగనట్లుగా గంభీరంగా కూర్చున్నాడు. అంతటితో ఆగకుండా ఆ చేపలకు ఆహారాన్ని కూడా ఆ తలపై ఉన్న నీటిలోనే వేయడం ఈ వీడియోలో మనం చూడవచ్చు.



ఈ 23 సెకన్ల వీడియో @DrHemantMaurya అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేయబడింది. "ఈ రోజుల్లో ఫేమస్ అవ్వడానికి జనం ఏమైనా చేస్తున్నారు.. ఈ పెద్దాయన తల మీద చేపల పెంపకం మొదలుపెట్టారు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. "తలకాయను ఫిష్ ట్యాంక్ చేశావా తాతా.. సూపర్!" అని ఒకరు అంటే, "తదుపరి అడుగు ఏంటి? నెత్తి మీద రొయ్యల పెంపకం లేదా పీతల ఫార్మింగ్ చేస్తారా?" అంటూ మరొకరు సెటైర్లు వేశారు. "సోషల్ మీడియా పుణ్యమా అని జనం పొలాల్లో కాకుండా తలకాయల మీద వ్యవసాయం చేస్తున్నారు" అని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు.

సోషల్ మీడియా యుగంలో కంటెంట్ ఏదైనా సరే.. అది వింతగా ఉంటేనే జనం చూస్తారని ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది చూడ్డానికి సరదాగా అనిపించినా.. ప్లాస్టిక్, కెమికల్స్ ఉన్న నీటిని తల మీద అంతసేపు ఉంచుకోవడం చర్మానికి హాని కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఈ హెడ్ ఫిష్ ట్యాంక్ వీడియో మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే వేల సంఖ్యలో వ్యూస్ సంపాదించిన ఈ వీడియో, సోషల్ మీడియా పిచ్చి ఏ స్థాయికి చేరిందో మరోసారి నిరూపిస్తోంది.

Tags:    

Similar News