Viral Video: కట్టుకున్న భార్యను అలా వదిలేస్తే ఎలా గురూ.. వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: కట్టుకున్న భార్యకు జీవితాంతం తోడుగా ఉండాలని చెబుతుంటారు.
Viral Video: కట్టుకున్న భార్యను అలా వదిలేస్తే ఎలా గురూ.. వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: కట్టుకున్న భార్యకు జీవితాంతం తోడుగా ఉండాలని చెబుతుంటారు. పెళ్లినాడు అగ్ని సాక్షిగా ప్రమాణం కూడా చేయిస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం కట్టుకున్న భార్యను ఉన్నపలంగా రోడ్డుపై వదిలేసి వెళ్లాడు. అయితే ఇది చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. భార్యను వదిలేస్తే నవ్వడం ఏంటని అనుకుంటున్నారా.? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోలో ఓ వ్యక్తి తన భార్య, బిడ్డతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అతని ముందు సడెన్‌గా ఓ ట్రక్కు రావడంతో బైక్ కాస్త డీవియేట్ అయ్యింది. అప్పటికే మధ్యలో కుమారుడిని కూర్చోబెట్టి, వెనక భార్యను పెట్టుకుని బైక్ నడుపుతున్న ఆ భర్తకు బైక్‌కి బ్యాలెన్స్ తప్పిన విషయం అర్థమైంది. వెంటనే బైక్‌ను కంట్రోల్ చేశాడు.
అయితే అప్పటికే వెనకాల కూర్చున్న భార్య కింద పడిపోయింది. అయితే ఆ విషయం భర్తకు తెలియలేదు. ఆగకుండా వెళ్లిపోయాడు. వెనకాల వస్తున్న ఓ వ్యక్తి దీనంతటినీ వీడియోలో బంధించాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కట్టుకున్న భార్యను ఇలా వదిలేసి వెళ్తే ఎలా గురూ అంటూ కామెంట్లు చేస్తున్నారు.