Viral Video: ఈ వీడియో చూడాలంటే.. కచ్చితంగా ధైర్యం ఉండాల్సిందే.
ఈ మధ్యకాలంలో కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Viral Video: ఈ వీడియో చూడాలంటే.. కచ్చితంగా ధైర్యం ఉండాల్సిందే.
Viral Video: ఈ మధ్యకాలంలో కింగ్ కోబ్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించిన వీడియోలకు లేక్కేలేదు. ప్రతీ రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఇలాంటి ఓ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో.? అందులో ఏముందంటే..
నెట్టింట వైరల్ అవుతోన్న వీడియోలో.. ఒక వ్యక్తి కింగ్ కోబ్రాను అత్యంత సమీపంగా తాకుతూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని 'A King Cobra Upclose' అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కింగ్ కోబ్రా భారతదేశంలో కనిపించే పొడవైన విషపూరిత పాము. దీని కాటు అత్యంత ప్రమాదకరం. అందుకే ఈ పామును చూస్తేనే గుండె ఆగి పోయినంత పని అవుతుంది. కానీ ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి మాత్రం చాలా ధైర్యంగా ఆ పామును చేత్తో పట్టుకుంటున్నాడు.
దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ ఆ పామును ఇంత సమీపంలో ఉండటానికి ధైర్యం ఎలా వచ్చింది?” అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ ఆ పాము విషం తీసినట్లు ఉన్నారు అంటూ స్పందిస్తున్నారు.
ఇక కింగ్ కోబ్రా విషయానికొస్తే.. ప్రపంచంలో పొడవైన విషపూరిత పాముగా గుర్తింపు పొందింది. ఇది ఎక్కువగా 10 నుంచి 13 అడుగుల పొడవు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇది 18 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది. దీని కాటు నుంచి 400-500 మిల్లీగ్రాముల వరకు విషం విడుదలవుతుంది. ఈ స్థాయి విషం 20 మందిని లేదా ఏకంగా ఒక ఏనుగును చంపగలదు.
A King Cobra Upclose pic.twitter.com/rP5xuXGCLO
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) May 17, 2025