Viral News: కాసేపట్లో అంత్యక్రియలు.. దగ్గుతూ లేచి కూర్చున్న మృతదేహం..! సీన్ కట్‌చేస్తే..
Viral News: హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ జిల్లాలో కోట్ మజ్రి గ్రామంలో ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగింది.
Viral News: కాసేపట్లో అంత్యక్రియలు.. దగ్గుతూ లేచి కూర్చున్న మృతదేహం..! సీన్ కట్‌చేస్తే..
Viral News: హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ జిల్లాలో కోట్ మజ్రి గ్రామంలో ఆశ్చర్యం కలిగించే సంఘటన జరిగింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 75 ఏళ్ల షేర్ సింగ్‌కు వైద్యులు మరణించగా, కుటుంబ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహన సంస్కారాలకు ఏర్పాట్లు ప్రారంభించారు.
అంత్యక్రియల కోసం బంధువులు చేరుకున్నారు. శవపేటిక సిద్ధం చేయబడింది, ఆచారాలకు అవసరమైన వస్త్రాలు, ఆహార ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అంతిమ స్నానం చేయించేందుకు షేర్ సింగ్‌ను మంచంపై పడుకోబెట్టి వెంటిలేటర్ ట్యూబ్‌ను తొలగించారు. అంతే, ఊహించని విధంగా షేర్ సింగ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి బిగ్గరగా దగ్గాడు! అక్కడ ఉన్నవారు విస్తుపోయారు. మొదట ఆందోళనకు గురైనా, వెంటనే అతనికి నీళ్లు తాగించి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం షేర్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మాజీ సర్పంచ్ రంజిత్ సింగ్ స్పందిస్తూ, "వెంటిలేటర్ ట్యూబ్ తొలగించగానే ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాడు. ఇది మాకు అద్భుత ఆనందాన్ని ఇచ్చింది" అన్నారు.
అంత్యక్రియలకు విచారం చెంది వచ్చిన బంధుమిత్రులే ఇప్పుడు సంబరాలు చేసుకుంటూ వెళ్లిపోయారు. మరణించిన వ్యక్తి తిరిగి జీవించడమన్నది వింత అనిపించవచ్చు కానీ, కోట్ మజ్రి గ్రామంలో ఇది నిజంగా జరిగింది. ఇదొక అద్భుత సంఘటనగా ప్రజల మదిలో నిలిచిపోనుంది.