రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టిక్‌ట్ పోయిందా..! టెన్షన్ వద్దు ఇలా చేయండి..

Indian Railway: కానీ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టికెట్ పోతే ఎలా ఉంటుంది? భయంతో పాటు జరిమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Update: 2021-11-09 16:15 GMT
ఇండియన్ రైల్వే (ఫైల్ ఇమేజ్)

Indian Railway: ప్రతిరోజు చాలా మంది ప్రయాణికులు రైలులో ప్రయాణం చేస్తారు. పండుగల సమయంలో అయితే కుటుంబంతో కలిసి ఇళ్లకు వెళుతారు. అటువంటి పరిస్థితిలో తొందరలో కొన్ని వస్తువులను మరిచిపోతారు. దీని వల్ల మనం కొంత ఆందోళనకు గురవుతాం. కానీ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టికెట్ పోతే ఎలా ఉంటుంది? భయంతో పాటు జరిమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తవానికి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు టికెట్‌ పోయినట్లయితే టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. సులభంగా మరొక టికెట్ తీసుకోవచ్చు. కేవలం ఈ ప్రక్రియలను అనుసరిస్తే సరిపోతుంది.నేటి కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్‌ ఉంటుంది. కాబట్టి మీ టికెట్ పోయినట్లయితే దానికి సంబంధించిన ఏదైనా సమాచారం ఫోన్‌లో ఉంటే మీరు దానిని TTEకి చూపించవచ్చు. అయితే మీ ఫోన్‌లో టికెట్ చూపించే సదుపాయం లేకుంటే రూ.50 జరిమానా చెల్లించి కొత్త టిక్కెట్‌ను పొందవచ్చు. కానీ ఇదంతా టీటీఈని వెంటనే సంప్రదించి చేయాలి.

TTE చార్ట్ తయారు చేయడానికి ముందు మీరు ఈ పనులన్నీ చేయాలి. ఎందుకంటే చార్ట్ సిద్ధమైన తర్వాత కన్ఫర్మ్ చేసిన టికెట్ డూప్లికేట్ కోసం దరఖాస్తు చేసుకుంటే సగం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. చార్ట్ సిద్ధం చేయడానికి ముందు మీరు డూప్లికేట్ టికెట్ కోసం అడిగితే మీరు రెండో స్లీపర్ క్లాస్ డూప్లికేట్ టిక్కెట్‌కు రూ. 50, రెండవ తరగతికి అయితే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ల కోసం మాత్రం డూప్లికేట్ టిక్కెట్లు జారీ చేయబడవు.

మీరు టిక్కెట్ కోల్పోయిన తర్వాత డూప్లికేట్ టికెట్ తీసుకున్నట్లయితే ఆ తర్వాత మీకు అసలు టిక్కెట్ కూడా వస్తుంది. రెండు టిక్కెట్లను రైలు బయలుదేరే ముందు రైల్వే అధికారులకు చూపించవచ్చు. దీనితో మీరు డూప్లికేట్ టికెట్ రుసుమును తిరిగి పొందుతారు. అయితే దాని మొత్తంలో 5% తీసివేస్తారు. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చు.

Tags:    

Similar News