Viral Video: తాగి రోడ్డుపక్కనే పడుకున్నాడు.. దగ్గరగా వెళ్లిన చిరుత.. వైరల్ వీడియో

Viral Video: అర్ధరాత్రి ఒక వ్యక్తి బాగా తాగి రోడ్డుపక్కనే పడుకుండిపోయాడు. మందుబాబుగారు మంచి నిద్రలో ఉన్నప్పుడు రోడ్డుపైకి చిరుత వచ్చింది.

Update: 2025-07-05 12:28 GMT

Viral Video: తాగి రోడ్డుపక్కనే పడుకున్నాడు.. దగ్గరగా వెళ్లిన చిరుత.. వైరల్ వీడియో

Viral Video: అర్ధరాత్రి ఒక వ్యక్తి బాగా తాగి రోడ్డుపక్కనే పడుకుండిపోయాడు. మందుబాబుగారు మంచి నిద్రలో ఉన్నప్పుడు రోడ్డుపైకి చిరుత వచ్చింది. ఇంకేముంది.. మందుబాబు దగ్గరలో కనబడేసరికి అతనికి దగ్గరగా వెళ్లింది. ఈ వీడియో గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా ఈ వీడియోకి తెగ కామెంట్లు పెడుతున్నారు.

ఈ మధ్య కాలంలో ఊళ్లలోకి చిరుతలు, పులులు ఎక్కువగా వస్తున్నాయి. వారికి ఎవరు కనిపిస్తే వారిపై దాడులు చేస్తున్నాయి. కుక్కలు, మేకలు వంటి వాటిని ఎత్తుకు వెళ్లిపోతున్నాయి. అయితే ఇలాంటి షాకింగ్ ఘటనల్లో ఇటీవల ఒక సంఘటన చోటు చేసుకుంది. దాడి చేయాల్సిన చిరుత ఏం చేసిందో మీరే చూడండి.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఒక మందుబాబు బాగా తాగేసి రోడ్డుపక్కన పడుకుని నిద్రపోతుంటాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఒక చిరుత రోడ్డు మీదకు వస్తుంది. రోడ్డుపైన అటు ఇటూ తిరుగుతు ఉంటుంది. అదే సమయంలో రోడ్డుపక్కన పడుకుని ఉన్న వ్యక్తి దగ్గరకు వస్తుంది. ఎటాక్ చేయడానికి చాలా నెమ్మదిగా నడుచుకుంటూ దగ్గరగా వెళుతుంది. కానీ అంతలోనే ఏమయిందో ఏమో అక్కడ నుంచి సైలెంట్‌గా వెళ్లిపోతుంది.

ఈ వీడియో సోషల్ మీడియా తెగ చక్కర్లు కొడుతోంది. అయితే నెటిజన్లు ఏం అంటున్నారా.. అది మందుకున్న పవర్ అని, ఏం బ్రాండ్ తాగావురా బాబు..అనే ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఆ చిరుత పులి అతన్ని తినడానికే దగ్గరగా వెళ్లింది. కానీ అతని దగ్గర గుప్పున వచ్చే వాసన తనకు నచ్చక అక్కడ నుంచి వెనక్కి వచ్చేసిందని పోస్టులు పెడుతున్నారు.



Tags:    

Similar News