Ugadi 2023: షడ్రచుల సమ్మేళనమే ఉగాది పండుగ

Ugadi: పచ్చడిలో జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం

Update: 2023-03-22 00:30 GMT

Ugadi: ఉగాది రోజు ముఖ్యమైనది పచ్చడి.. షడ్రుచుల్లో ఒక్కో పదార్థం ఒక్కో భావం.. అనుభవానికి ప్రతీక

Ugadi: ఉగాది పండుగ అంటే మొదట గుర్తొచ్చేది పచ్చడి.. ఉగాది రోజు ముఖ్యమైనది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటుంది. పచ్చడిలో ఒక్కో పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీకగా నిలుస్తుంది..

ఉగాది పండుగ తెలుగువారికి ప్రత్యేకమైన పర్వదినం. తెలుగు నూతన సంవత్సరానికి ఆరంభం. ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకొంటారు. ఉగాది పండుగలో ముఖ్యమైంది ఉగాది పచ్చడి. పండగలో పచ్చడికే విశేష ప్రాముఖ్యం ఉంది. ఈ ఉగాది పచ్చడి అంటేనే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు కలిసిన షడ్రుచుల సమ్మేళనం. సంవత్సరం పొడువునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఈ పచ్చడి సూచిస్తుంది. ఈ పచ్చడి కోసం చెరకు రసం, అరటి పళ్లు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలైన పదార్థాలను కూడా ఉపయోగిస్తారు.

పచ్చడి తయారు చేసే విధానాన్ని మనమూ తెలుసుకుందాం.... ముందుగా వేప పువ్వును కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి. చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి పది నిమిషాల తర్వాత దాన్ని గుజ్జును వేరు చేయాలి. మామిడికాయ, మిరపకాయలు, కొబ్బరి సన్నగా తరగాలి. బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకొని దానికి చింతపండు గుజ్జు కలపాలి. ఈ మిశ్రమంలో మామిడికాయ, తరిగిన కొబ్బరి, మిరపకాయ ముక్కలను వేసి... చివరిగా ఒక అర స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి. అంతే షడ్రుచుల ఉగాది పచ్చడి సిద్ధమైపోయినట్టే. ఇక వసంతలక్ష్మిని ఆహ్వానించి, నైవేద్యంగా సమర్పించి, తర్వాత స్వీకరించాలి. అంతే కాదు మిగతా వాళ్లకు కూడా పంపిణీ చేయాలి.

Tags:    

Similar News