Karnataka Shock: పాఠశాల వాష్‌రూమ్‌లోనే బిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థిని

కర్ణాటకలోని యాదగిర్‌ జిల్లాలో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని, పాఠశాల వాష్‌రూమ్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. వారిని వెంటనే షాహాపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

Update: 2025-08-28 14:32 GMT

అధికారుల చర్యలు

ఈ ఘటనపై అధికారులు స్పందించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌, సిబ్బందిపై సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ఆదేశించారు. నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఎలా బయటపడింది?

బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినప్పటికీ, ఆలస్యంగా బయటపడింది. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు శశిధర్‌ కోసాంబే, అధికారులు సమయానికి సమాచారం ఇవ్వలేదని తీవ్రంగా విమర్శించారు. దీనిపై ప్రిన్సిపాల్‌, సిబ్బందిపై సుమోటోగా కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

ప్రిన్సిపాల్‌ స్పందన

పాఠశాల ప్రిన్సిపాల్‌ బసమ్మ మాట్లాడుతూ – తాను కేవలం నెల రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించానని తెలిపారు. ఆ విద్యార్థిని జనన సర్టిఫికెట్‌ ప్రకారం ఆమె వయస్సు 17 సంవత్సరాలు 8 నెలలు అని చెప్పారు. అంతేకాకుండా గర్భం లక్షణాలు కనిపించలేదని, జూన్‌లో స్కూల్‌ ప్రారంభమైనప్పటి నుండి ఎక్కువగా హాజరు కాకపోయి, ఆగస్టు 5 నుంచి మాత్రమే రెగ్యులర్‌గా రావడం ప్రారంభించిందని వివరించారు.

తలనొప్పి, అనారోగ్య కారణాలతో ఆ విద్యార్థిని తరచూ గైర్హాజరైందని, ఆమె బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం తమకే షాక్‌ ఇచ్చిందని తెలిపారు. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు మాట్లాడటానికి నిరాకరించినట్లు కూడా ప్రిన్సిపాల్‌ తెలిపారు.

Tags:    

Similar News