Viral Video: జలసమాధి అయిన చిన్నారి.. కవరేజ్ చేస్తుండగా జర్నలిస్టుకు షాక్!
Viral Video: బ్రెజిల్‌లోని మియరిమ్ నది ఒడ్డున ఊహించని ఘటన ఒక్కసారిగా అందరినీ గడగడలాడేలా చేసింది.
Viral Video: జలసమాధి అయిన చిన్నారి.. కవరేజ్ చేస్తుండగా జర్నలిస్టుకు షాక్!
Viral Video: బ్రెజిల్‌లోని మియరిమ్ నది ఒడ్డున ఊహించని ఘటన ఒక్కసారిగా అందరినీ గడగడలాడేలా చేసింది. జూన్ 29న ఈత కోసం వెళ్లిన 13 ఏళ్ల బాలిక రైస్సా అనూహ్యంగా అదృశ్యమైన నేపథ్యంలో ఆమె ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యల్లో మీడియా కూడా భాగమైంది. ఈ క్రమంలో జర్నలిస్ట్ లెనిల్డో ఫ్రజావో మియరిమ్ నదిలోకి దిగి ఆమె ఈత కొట్టిన ప్రాంతాన్ని రిపోర్ట్ చేస్తుండగా… తాను అడుగు వేసిన నీటి అడుగున ఏదో తాకినట్టు అనిపించిందని తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
"నీటిలో ఏదో తాకింది... అది ఆమె అయి ఉండొచ్చు!" అని భయభ్రాంతులతో ఫ్రజావో చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. నీరు ఛాతీ వరకు ఉన్న లోతులో నడుచుకుంటూ, రైస్సా అదృశ్యమైన ప్రదేశాన్ని చూపించాల్సిన సమయంలోనే ఆయన అడుగు ఒక మృతదేహాన్ని తాకింది. "అది చేయిలా అనిపించింది... అది ఆమెదా? లేక చేపా? తెలియలేదు..." అని బిగ్గరగా చెప్పిన ఆయన వెంటనే నదినుంచి బయటపడ్డారు.
ఆ వెంటనే ఫ్రజావో తన అనుమానాన్ని రెస్క్యూ బృందాలకు తెలియజేశారు. అనంతరం జూన్ 30న ఉదయం ఫైర్‌ఫైటర్లు, డైవర్ల సాయంతో జరిగిన గాలింపులో ఫ్రజావో నిలబడిన ప్రదేశంలోనే బాలిక రైస్సా మృతదేహం లభించింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతికి గురయ్యారు.
పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, రైస్సా మృతికి వెనక ఎటువంటి హింసాత్మక లక్షణాలు లేవని, ఆమె అనుకోకుండా నీటిలో మునిగి చనిపోయినట్టు తేలింది. అదే రోజు సాయంత్రం రైస్సా అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి.
ఈ సంఘటన స్థానికులనే కాదు, వీడియో చూసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. నదిలో జరిగిన ఈ భయానక అనుభవాన్ని ఫ్రజావో మరిచిపోలేనని, తన జీవితంలో ఇదొక అసహ్యకరమైన సంఘటనగా నిలిచిపోతుందని చెప్పారు.