January 2026 Holidays List: జనవరిలో పండుగే పండుగ.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీగా సెలవులు.. లిస్ట్ ఇదే!

January 2026 Holidays List: 2026 జనవరి నెలలో సెలవుల సందడి షురూ! ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు భారీగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వాలు. స్కూళ్లు, కాలేజీలు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సెలవుల జాబితా మీకోసం.

Update: 2026-01-02 15:00 GMT

January 2026 Holidays List: జనవరిలో పండుగే పండుగ.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీగా సెలవులు.. లిస్ట్ ఇదే!

January 2026 Holidays List: 2025కు గుడ్‌బై చెప్పి 2026లోకి అడుగుపెట్టిన వేళ తెలుగు రాష్ట్రాల్లో జనవరి నెల మొత్తం సెలవుల వాతావరణం నెలకొంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ కారణంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విద్యాసంస్థలకు వరుసగా సెలవులు ప్రకటించడంతో విద్యార్థులకు లాంగ్ బ్రేక్ లభించింది.

తెలంగాణ ప్రభుత్వం మొత్తం 9 రోజులు సంక్రాంతి సెలవులు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు జనవరి 10 నుంచి 18 వరకు పండుగ సెలవులు ఖరారు చేశారు. వీటికి తోడు శని, ఆదివారాలు, గణతంత్ర దినోత్సవం కలిసివచ్చినందున జనవరి నెలలో సగానికి పైగా రోజులు సెలవులుగానే కనిపిస్తున్నాయి.

దీంతో విద్యార్థులు, ఉద్యోగులు ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ సెలవులతో పాటు ఆప్షనల్ హాలిడేస్ సౌలభ్యం ఉండటంతో ఈ నెల “ఫుల్ హాలిడే మూడ్”గా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

స్కూళ్లకు సెలవుల జాబితా

జనవరి 04 — ఆదివారం

జనవరి 10 — రెండో శనివారం

జనవరి 11 — ఆదివారం

జనవరి 12 — సంక్రాంతి సెలవు

జనవరి 13 — సంక్రాంతి సెలవు

జనవరి 14 — భోగి

జనవరి 15 — మకర సంక్రాంతి

జనవరి 16 — కనుమ

జనవరి 17 — సంక్రాంతి సెలవు

జనవరి 18 — ఆదివారం

జనవరి 25 — ఆదివారం

జనవరి 26 — గణతంత్ర దినోత్సవం

జనవరి 31 — ఆదివారం

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు

సాధారణ సెలవులు:

ఆదివారాలు: జనవరి 4, 11, 18, 25, 31

రెండో శనివారం: జనవరి 10

సంక్రాంతి పండుగ: జనవరి 14 (భోగి), 15 (సంక్రాంతి), 16 (కనుమ)

గణతంత్ర దినోత్సవం: జనవరి 26

ఆప్షనల్ సెలవులు:

జనవరి 01 — నూతన సంవత్సరం

జనవరి 03 — హజ్రత్ అలీ జయంతి

జనవరి 16 — షబ్-ఎ-మెరాజ్

మొత్తంగా చూస్తే జనవరి నెల తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవుల పండుగగా మారిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News