Hotel: లవర్స్‌కి ఈ హోటల్స్ వరం.. ప్రైవసీతో పాటు మరెన్నో ఫీచర్లు
Hotel: జపాన్‌లో "లవ్ హోటల్స్ పేరుతో ప్రత్యేక హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. టోక్యో వంటి ప్రదేశాల్లో షిబుయా వీధుల్లో, ఒసాకాలో నియాన్ వెలుగుల మధ్య కనిపించే ఈ హోటల్స్ పూర్తిగా ప్రైవసీని అందిస్తాయి. కొన్ని గంటల సమయం కోసం గదులు అద్దెకు ఇవ్వడమే వీటి ప్రధాన లక్ష్యం.
Hotel: లవర్స్‌కి ఈ హోటల్స్ వరం.. ప్రైవసీతో పాటు మరెన్నో ఫీచర్లు
Love Hotels: జపాన్‌లో "లవ్ హోటల్స్ పేరుతో ప్రత్యేక హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. టోక్యో వంటి ప్రదేశాల్లో షిబుయా వీధుల్లో, ఒసాకాలో నియాన్ వెలుగుల మధ్య కనిపించే ఈ హోటల్స్ పూర్తిగా ప్రైవసీని అందిస్తాయి. కొన్ని గంటల సమయం కోసం గదులు అద్దెకు ఇవ్వడమే వీటి ప్రధాన లక్ష్యం. ఇవి ఎక్కువగా జంటలు ప్రైవసీ కోసం వాడతారు.
లవ్ హోటల్స్ లో సాధారణ గదులు ఉండవు. మీ ఊహలకూ అందని డిజైన్‌లతో గదులను అలంకరిస్తారు. జైలు గదుల మాదిరిగానీ, కార్టూన్ థీమ్స్ ఉన్న గదులుగానీ, నీటిమోపైన అక్వేరియంలా కనిపించే గదులు, ఆసుపత్రుల తరహాలో గదులు, హలో కిట్టీ, సైన్స్ ఫిక్షన్ థీమ్ గదులు, ఇలాంటి డిజైన్‌లు వినోదాన్ని, వింత అనుభూతిని కలిగించడానికి. పైగా దుస్తులు అద్దెకు కూడా ఇస్తారు.
లవ్ హోటల్స్ కు ప్రాచీన చరిత్ర ఉంది. ఇది 16వ శతాబ్దంలో ప్రారంభమైంది. అప్పట్లో ప్రజలు టీహౌజ్‌లను ఉపయోగించేవారు. ఇది ఒక రహస్య ప్రదేశంగా ఉండేది. అక్కడికి ఎవరు వచ్చారో ఎవరికీ తెలియదు. కాలక్రమంలో ఈ టీహౌస్‌లు ఆధునిక రూపంలో లవ్ హోటల్స్‌గా మారాయి.
ఈ హోటల్స్ గోప్యతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తాయి. గదులు ఆన్‌లైన్‌లో లేదా వెండింగ్ మెషీన్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. సిబ్బందితో మాట్లాడాల్సిన అవసరం లేదు. రహస్యంగా హోటల్‌లో ప్రవేశించి, బయటకు రావొచ్చు.
కొన్ని చోట్ల కారులో నుంచే లిఫ్ట్ ద్వారా నేరుగా గదికి చేరుకునే సదుపాయం ఉంటుంది. చెల్లింపు కూడా చాలా వేగంగా, రహస్యంగా పూర్తి చేయవచ్చు.
జపాన్ వ్యాప్తంగా సుమారు 37,000 లవ్ హోటల్స్ ఉన్నాయని అంచనా. వీటిలో కొన్ని నగరాల్లో కనిపిస్తే, మరికొన్ని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉంటాయి. వీటిలో పూర్తి గోప్యత ఉంటుంది. అందరికీ అందుబాటులో ధరలు ఉంటాయి.