Dies Abroad: మీకు తెలిసిన వ్యక్తి విదేశాల్లో చనిపోతే.. భారత్‌కు తీసుకురావడం ఎలా..!

Dies Abroad: ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు, ఉపాధి కోసం విదేశాలకు వెళుతున్నారు. ప్రమాదవశాత్తు అక్కడే చనిపోవడంతో డెడ్‌బాడీని ఇంటికి తీసుకురావడం కష్టమవుతుంది.

Update: 2024-01-08 16:00 GMT

Dies Abroad: మీకు తెలిసిన వ్యక్తి విదేశాల్లో చనిపోతే.. భారత్‌కు తీసుకురావడం ఎలా..!

Dies Abroad: ఈ రోజుల్లో చాలామంది ఉద్యోగాలు, ఉపాధి కోసం విదేశాలకు వెళుతున్నారు. ప్రమాదవశాత్తు అక్కడే చనిపోవడంతో డెడ్‌బాడీని ఇంటికి తీసుకురావడం కష్టమవుతుంది. ఇందుకోసం కుటుంబ సభ్యులు నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. డెడ్‌బాడీని భారత్‌కు తీసుకురావడం చాలా కష్టమవుతుంది. వాస్తవానికి విదేశాల్లో ఉన్న బంధువులు డెడ్ బాడీని భారత్‌కు తీసుకురాగలరు. అయితే ఇందుకు ప్రభుత్వం సహకారం అందించాలి. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారికి సాయం అందించడానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను రూపొందించింది. దాని గురించి తెలుసుకుందాం.

ప్రభుత్వ సహాయం

ఇంతకు ముందు విదేశాల్లో భారతీయుడు చనిపోతే భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకురావడానికి చాలా సమయం పట్టేది. చాలా సందర్భాలలో భారత ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవలసి వచ్చేది. కానీ ఇప్పుడు దీని కోసం సుదీర్ఘ ప్రక్రియ అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ఓపెన్ ఈ-కేర్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది. దీని సాయంతో ఇప్పుడు ఎవరైనా భారతీయ పౌరుడు విదేశాల్లో చనిపోతే అతడి భౌతిక కాయాన్ని సులువుగా భారత్‌కు తీసుకురావచ్చు.

ఇందుకోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నోడల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉన్న తన కుటుంబ సభ్యుల భౌతికకాయాన్ని ఎవరైనా భారత్‌కు తీసుకురావాలనుకుంటే లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి. నోడల్ అధికారి దీనిపై విచారణ జరిపి 48 గంటల్లో చర్యలు తీసుకుంటారు. మీ అప్లికేషన్ స్టేటస్‌ను రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా ఇ-కేర్ పోర్టల్‌లో చెక్‌ చేయవచ్చు.

ఈ పత్రాలను కలిగి ఉండాలి

విదేశాల నుంచి భారతదేశానికి ఎవరైనా భౌతిక అవశేషాలను తీసుకురావడానికి కుటుంబ సభ్యులు నోడల్ కార్యాలయంలో అవసరమైన పత్రాలను చూపించవలసి ఉంటుంది. ఇందులో సంబంధిత వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం, దీంతో పాటు అతని శరీరం భద్రంగా ఉండేందుకు రసాయనాలు పూసినట్లు ధ్రువీకరణ పత్రం, వ్యక్తి మరణించిన దేశంలోని భారత రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC), చివరకు చనిపోయిన వ్యక్తి రద్దు చేసిన పాస్‌పోర్ట్ ఉండాలి.

Tags:    

Similar News