Heart Attack: గుండెపోటు వచ్చిన వెంటనే ఈ ఆకు రసాన్ని మీ నాలుకపై పిండుకోండి.. ప్రాణాలను కాపాడే ఏకైక ఔషధం..!
Neem For Heart Attack: ఈ కాలంలో గుండెపోటు (హార్ట్ అటాక్) సమస్యలు భారీగా పెరిగిపోతున్నాయి.
Neem For Heart Attack: ఈ కాలంలో గుండెపోటు (హార్ట్ అటాక్) సమస్యలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అవ్యవస్థిత జీవనశైలి, ఎక్కువగా కూర్చొని పని చేయడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె సమస్యలు వస్తున్నాయి. ఇక కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ కారణంగా కూడా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది ఆకస్మికంగా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు వార్తల్లో తరచూ వినిపిస్తున్నాయి.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే, రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం, శారీరకంగా చురుకుగా ఉండడం, సరైన డైట్ ఫాలో కావడం అవసరం. అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, ఆల్కహాల్ దూరంగా ఉండటం కూడా ఎంతో అవసరం.
గుండెపోటు లక్షణాలు
గుండెపోటు వచ్చే ముందు, వయస్సు, లైఫ్‌స్టైల్‌ను బట్టి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
గుండెలో నొప్పి
చేతులు, భుజాలు, మెడ, వీపు భాగాల్లో నొప్పి
కొందరికి దంతాలు, దవడ ప్రాంతంలో నొప్పి
ఆకస్మికంగా విపరీతమైన చెమట
వాంతులు, తలనొప్పి
వికారంగా అనిపించడం
తేలికపాటి గుండెనొప్పి, ఒత్తిడి
స్త్రీలు, పురుషుల్లో లక్షణాలు కొంత భిన్నంగా ఉంటాయి. కొంతమందికి వెన్నునొప్పి, అలజడి కూడా కనిపిస్తుంది.
గుండెపోటు వచ్చిన వెంటనే చేయాల్సినవి
ఒకవేళ గుండెపోటు వస్తే, వెంటనే అత్యవసర నెంబర్ (108) కు కాల్ చేయాలి. అంబులెన్స్‌ను వెంటనే రప్పించాలి. ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు కొన్ని ప్రాథమిక చర్యలు తీసుకోవాలి.
వైద్యులు సూచించే ప్రాథమిక చిట్కాలు:
ఆస్ప్రిన్ : గుండెపోటు అనిపిస్తే వెంటనే ఒక ఆస్ప్రిన్ తినడం ద్వారా రక్తం గడ్డకట్టకుండా ఉండే అవకాశం ఉంది. అయితే ఆస్ప్రిన్‌కు అలర్జీ ఉన్నవారు తీసుకోరాదు.
నైట్రోగ్లిసరిన్ : గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు సూచించినట్లయితే ఇది ఉపయోగించవచ్చు.
సీపీఆర్ (CPR) : అవసరమైతే వెంటనే CPR ఇవ్వడం ప్రాణాపాయ స్థితిని నివారించగలదు.
గుండెపోటు వచ్చిన వెంటనే వేపాకుల రసం నాలుకపై వేయడం లేదా రెండు వేపాకులను నమలడం ద్వారా రక్తం గడ్డకట్టకుండా ఉండే అవకాశం ఉంది. ఇది ఆరోగ్య నిపుణులు సూచించే ప్రాచీన పద్ధతులలో ఒకటి. అయితే ఇది తాత్కాలికమే… వెంటనే వైద్య సేవలు తీసుకోవడం తప్పనిసరి.
ఈ రోజుల్లో హార్ట్ హెల్త్ చాలా ముఖ్యం. సరైన జీవనశైలి, ఆరోగ్యంగా తినడం, రెగ్యులర్ వాకింగ్, స్ట్రెస్ లెస్ జీవితం ఉంటే గుండెపోటు వంటి సమస్యల్ని నివారించవచ్చు. ఏ చిన్న లక్షణం వచ్చినా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.