HD 181327: నీటి మాయ.. నక్షత్రం చెప్పిన భూమి పుట్టుక కథ!
HD 181327: ఈ నక్షత్రం పేరు HD 181327. ఇది సుమారు 155 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మన సూర్యుడికి కోట్ల ఏళ్ల వయస్సు ఉండగా, దీని వయస్సు కేవలం 2 కోట్ల 30 లక్షల సంవత్సరాలు మాత్రమే. అంటే ఇది ఇంకా యువనక్షత్రం.
HD 181327: నీటి మాయ.. నక్షత్రం చెప్పిన భూమి పుట్టుక కథ!
HD 181327: ఈ నక్షత్రం పేరు HD 181327. ఇది సుమారు 155 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మన సూర్యుడికి కోట్ల ఏళ్ల వయస్సు ఉండగా, దీని వయస్సు కేవలం 2 కోట్ల 30 లక్షల సంవత్సరాలు మాత్రమే. అంటే ఇది ఇంకా యువనక్షత్రం. దీని చుట్టూ దుమ్ము, బురద, ఐస్‌లతో కూడిన డెబ్రిస్ డిస్క్ ఉంది. మనం గ్రహాల రూపకల్పనలో ఇది తొలి దశ అని అనుకోవచ్చు.
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సహాయంతో శాస్త్రవేత్తలు ఈ నక్షత్రాన్ని అధ్యయనం చేశారు. అందులో వాటర్ ఐస్ అనగా నీటి క్రిస్టల్స్ కనిపించాయి. ఇవి మన సౌరవ్యవస్థలోని శని గ్రహం వలయాల్లో ఉన్న వాటర్ ఐస్‌లాంటివే. ఇవి భవిష్యత్‌లో గ్రహాల నిర్మాణానికి ఉపయోగపడే డర్టీ స్నోబాల్స్ లా ఉంటాయి. భూమిలాంటి గ్రహాలపై నీరు చేరడంలో ఇవి కీలకం కావచ్చు. ఈ నీటి శాతం బయట భాగాల్లో సుమారు 20% ఎక్కువగా ఉంది. . కానీ నక్షత్రానికి దగ్గరగా వచ్చే కొద్దీ అది తగ్గిపోతూ చివరకు కనిపించదు కూడా. దీని వెనక వున్నా అసలు కారణం నక్షత్రం విడుదల చేసే UV కిరణాలే అని భావిస్తున్నారు. అవి ఐస్‌ను ఆవిరి చేసి ఉండొచ్చు. లేదా నీరు కొండల లోపల చిక్కుకుని ఉండొచ్చు అం పరిశోధకుల అంచనా వేస్తున్నారు .
అదే సమయంలో, ఈ నక్షత్రం చుట్టూ ఉన్న డెబ్రిస్ డిస్క్‌లో చిన్న చిన్న రాళ్లు, ఐస్ ముక్కలు ఒకదానికొకటి ఢీకొంటూ ఉంటాయి. ఆ ఢీకొట్టే సమయంలో బయటకు నీటి ధూళి వదులుతుంది. ఈ నాజూకైన దృశ్యాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ స్పష్టంగా గుర్తించగలిగింది. మొత్తంగా ఈ వ్యవస్థ చాలా చురుకుగా పనిచేస్తోంది. మన సౌరవ్యవస్థలోని కూపర్ బెల్ట్‌ను ఇది ఆశ్చర్యంగా పోలి ఉంటుంది. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ నక్షత్రాన్ని, దీని లాంటి ఇంకా ఎన్నో యువ నక్షత్రాలను దగ్గరగా గమనించేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే, భూమి ఎలా పుట్టిందో, నీరు ఎలా చేరిందో తెలిసేందుకు ఇవే కీలకం. ఇది కేవలం ఒక అరుదైన పరిశోధన కాదు... భవిష్యత్తులో భూమిలాంటి గ్రహాలు ఎలా తయారవుతాయో, అక్కడ జీవం ఉండే అవకాశాలపై కూడా కొత్తగా ఆలోచించడానికి ఇది ఒక బలమైన ఆధారం. ఈ యువ నక్షత్రం స్టోరీ చూస్తే, మన గ్రహాల పుట్టుక వెనకున్న మిస్టరీ కాస్త స్పష్టంగా మారుతోంది.