Viral Video: వేరే అమ్మాయిని టచ్ చేస్తే...నేను ఊరుకుంటానా? నెట్టింట గొరిల్లా వీడియో వైరల్
Viral Video: అవును.. ప్రియుడు అయినా, భర్త అయినా వేరే అమ్మాయిన టచ్ చేస్తే ఏ అమ్మాయి ఊరుకుంటుంది.
Viral Video: వేరే అమ్మాయిని టచ్ చేస్తే...నేను ఊరుకుంటానా? నెట్టింట గొరిల్లా వీడియో వైరల్
Viral Video: అవును.. ప్రియుడు అయినా, భర్త అయినా వేరే అమ్మాయిన టచ్ చేస్తే ఏ అమ్మాయి ఊరుకుంటుంది. ఎవరూ ఊరు కోరు. మనుషులే కాదు జంతువులు కూడా అంతే. తన పార్టనర్ వేరే వాళ్లపై కన్ను వేసినా, టచ్ చేసినా ఇక అంతే సంగతులు. ఇలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఆ వీడియో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జూకి వెళ్లిన ఒక అమ్మాయి. గొరిల్లా బోన్‌లో ఉన్న గొరిల్లాలను వీడియో తీద్దామని వెళ్లింది. అయితే ఆ అమ్మాయికి ఒక మగ గొరిల్లా దగ్గరగా వచ్చి, తన జుట్టు పట్టుకుని..ఆ అమ్మాయిని అలానే చూస్తుంది. ఆ అమ్మాయి తన జుట్టును లాక్కుందామని ప్రయత్నించినా ఒక రొమాంటిక్ లుక్‌తో మగ గొరిల్లా జుట్టును వదలలేదు. కాసేపటి వరకు అలానే పట్టుకుని ఉంది. అయితే విచిత్రం ఏంటంటే.. ఈ సీన్ అంతా దూరం నుంచి చూస్తున్న ఆడ గొరిల్లా చకచకా అక్కడకు వచ్చింది. మగ గొరిల్లా ఏం చేస్తుందా.. అని పరిశీలించింది. ఇకేముందు, ఆడవాళ్లు ఏం చేస్తారో ఈ గొరిల్లా కూడా అదే చేసింది.
మగ గొరిల్లా రొమాంటిక్‌గా ఆ అమ్మాయిన చూడడం ఆడ గొరిల్లాకు నచ్చలేదు. దీంతో మగ గొరిల్లాను ఇష్టమొచ్చినట్లు చితగ్గొట్టింది. ఈ అరుదైన సన్నివేశాన్ని ఒక పర్యాటకులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. భార్య అయినా గొరిల్లా అయినా ఒకటే.. ఆడదే కదా అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే గొరిల్లా అమ్మాయి జుట్టుపట్టుకుని ఏడిపించడం, ఇది చూసిన ఆడ గొరిల్లా మగ గొరిల్లాను కొట్టడంపై జంతువుల్లోనూ ఆడవాళ్లపై వేధింపులకు వ్యతిరేకత ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం అంటూ కామెంట్లు చేసారు.