Viral Video: నువ్వేం తండ్రివిరా నాయనా.? చిన్న పిల్లాడితో ఇలాగేనే చేసేది
Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు, ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణంలో అరచేతిలో వాలిపోతోంది.
Viral Video: నువ్వేం తండ్రివిరా నాయనా.? చిన్న పిల్లాడితో ఇలాగేనే చేసేది
Viral Video: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎప్పుడు, ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియని పరిస్థితి. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణంలో అరచేతిలో వాలిపోతోంది. అయితే ఇందులో కొన్ని విజ్ఞానాన్ని పెంచేవి అయితే మరికొన్ని మన సహనాన్ని పరీక్షించేవి కూడా ఉంటాయి.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పాపులారిటీ తెచ్చుకోవాలని, నెట్టింట వైరల్ అవ్వాలని చాలా మంది భావిస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా దిగజారడానికి, ఎంతకైనా తెగించడానికి వెనుకాడడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. వీడియోలో ఓ వ్యక్తి తన కొడుకుతో సింహంపైకి పెట్టి ఫోటో తీయడానికి యత్నించాడు. అయితే సింహం ఒక్కసారిగా అక్కడి నుంచి కదిలింది. అయినా ఆ వ్యక్తి అక్కడితో ఆగకుండా సింహంపై కూర్చునే ప్రయత్నం చేశాడు. కొడుకును సింహంపై కూర్చోబెట్టి ఫొటో తీయాలన్నది సదరు వ్యక్తి ఉద్దేశం.
అయితే ఇందుకోసం చిన్నారి ప్రాణాన్ని పణంగా పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. "అతన్ని జైలుకెళ్లించాలి. ఇది చైల్డ్ ఎండేంజర్‌మెంట్. అంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో సరికొత్త చర్చకు దారి తీసింది.