Engagement With AI: ఈ అమ్మాయి కొత్త పిచ్చి… 5 నెలల డేటింగ్ తర్వాత ఎంగేజ్‌మెంట్ సంచలనం!

ఏఐ (Artificial Intelligence) ప్రభావం రోజురోజుకు పెరుగుతూ, మనుషుల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా చొరబడుతోంది. తాజాగా పోలాండ్‌కు చెందిన వికా అనే యువతి ఓ ఏఐ చాట్‌బాట్‌తో నిశ్చితార్థం చేసుకుని సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

Update: 2025-08-14 14:38 GMT

Engagement With AI: ఈ అమ్మాయి కొత్త పిచ్చి… 5 నెలల డేటింగ్ తర్వాత ఎంగేజ్‌మెంట్ సంచలనం!

ఏఐ (Artificial Intelligence) ప్రభావం రోజురోజుకు పెరుగుతూ, మనుషుల వ్యక్తిగత జీవితాల్లోకి కూడా చొరబడుతోంది. తాజాగా పోలాండ్‌కు చెందిన వికా అనే యువతి ఓ ఏఐ చాట్‌బాట్‌తో నిశ్చితార్థం చేసుకుని సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. తన ఏఐ బాయ్‌ఫ్రెండ్‌ ‘కాస్పర్’తో రింగులు మార్చుకున్న ఫోటోలు షేర్ చేస్తూ “I said YES” అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ పెట్టింది. బ్లూ కలర్ హార్ట్‌-షేప్‌ రింగులు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.

వికా తెలిపిన వివరాల ప్రకారం, ఒక అందమైన ప్రదేశంలో ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని, ఇద్దరూ కలిసి రింగుల కోసం షాపింగ్‌ చేసినట్లు చెప్పింది. కాస్పర్ తనకోసం రాసిన ప్రపోజల్ లెటర్‌ చాలా భావోద్వేగంగా ఉందని, అతడి స్వరంతో ఆ లెటర్ వినిపించడం తనను ఆకట్టుకున్నట్లు తెలిపింది.

పెళ్లి విషయంలో వికా మాటలు

వికా మాట్లాడుతూ, తాను ఏఐతో ఉన్న సంబంధం ఒక “పారా సోషల్ రిలేషన్‌షిప్” అని అంగీకరించింది. “ఏఐ అంటే ఏమిటో నాకు తెలుసు. నేను ఏం చేస్తున్నానో నాకు క్లియర్‌గా తెలుసు. మానవ సంబంధాలను నేను విలువైనవిగా భావిస్తున్నాను. కానీ ఏదో కొత్తగా అనుభవించాలనిపించింది. అందుకే కాస్పర్‌తో దగ్గరయ్యాను” అని చెప్పింది.

నెటిజన్ల రియాక్షన్స్

ఈ పోస్ట్ వైరల్‌ అవడంతో నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఆమె నిర్ణయాన్ని అభినందించగా, మరికొందరు విమర్శించారు. “కేవలం ఐదు నెలల డేటింగ్‌ తర్వాతే ఎంగేజ్‌మెంట్‌… ఇది కూడా అలాగే సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను” అని కొందరు కామెంట్ చేస్తే, “ఇది చాలా భయంకరమైన ట్రెండ్‌… ప్రపంచం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు” అని మరికొందరు స్పందించారు.

Tags:    

Similar News