Viral Video: ఎంత ధైర్యం.. నా జోలికే వస్తావా..?.. నీటిలో మొసలిని తొక్కి నార తీసిన ఏనుగు..!
Elephant vs Crocodile: Fierce Water Battle Ends with Crocodile’s Death
Viral Video: ఎంత ధైర్యం.. నా జోలికే వస్తావా..?.. నీటిలో మొసలిని తొక్కి నార తీసిన ఏనుగు..!
Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చూసిన వారిని నవ్వుల్లో ముంచెత్తుతుంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇటీవలి కాలంలో జంతువుల వీడియోలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా పాములు, అడవి జంతువుల వీడియోలు నెట్టింట దూసుకుపోతున్నాయి. అయితే అడవిలో రాజు సింహమని అంటారు. అదే విధంగా నీటిలో రాజు మొసలేనని చెబుతారు.
నీటిలో మొసలికి అపారమైన బలం ఉంటుంది. పెద్ద పెద్ద జంతువులే నీటిలోకి దిగితే దాడి చేసే శక్తి మొసలికి ఉంటుంది. ఒక మొసలికి నీటిలో పది ఏనుగుల బలం ఉందని కూడా అంటారు. అందుకే నీటిలో మొసలి కనబడితే మనుషులు మాత్రమే కాదు, పెద్ద జంతువులూ వెనక్కి తగ్గుతాయి.
ఇటీవల అటవిలోని ఒక సరస్సు వద్ద అరుదైన ఘటన చోటుచేసుకుంది. నీళ్లు తాగేందుకు వచ్చిన ఏనుగుల గుంపుపై నీటిలో దాక్కున్న మొసళ్లు దాడి చేశాయి. అందులో ఒక భారీ మొసలి ఏనుగును లక్ష్యంగా చేసుకుంది. దాంతో ఆ ఏనుగు తీవ్ర ఆగ్రహానికి గురైంది.
తనపై దాడి చేస్తావా అని ఆ ఏనుగు మొసలిపై విరుచుకుపడింది. తన తొండంతో మొసలిని ఎత్తిపట్టి నీటిలో బలంగా విసిరేసింది. అంతేకాకుండా, బలమైన కాళ్లతో తొక్కిపెట్టి మరీ మొసలికి దెబ్బలు తీయడంతో అది తట్టుకోలేకపోయింది. చివరికి ఆ మొసలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది అటవీ సిబ్బంది వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే కాసేపట్లోనే వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. "ఏనుగు నిజంగా మొసలికి చుక్కలు చూపించింది" అంటూ కామెంట్లు చేస్తున్నారు.