Viral Video: ఏనుగు చేసిన పనికి షాక్ అవుతోన్న నెటిజన్లు.. ఎంత మంచి హృదయమో అంటూ
Viral Video: సాధారనంగా ఏనుగులు అనగానే భయం వేస్తుంది. చిన్న జీవాలు కనిపిస్తే కాలితే తొక్కేస్తాయనే భావన కలుగుతుంది. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన చూస్తే మాత్రం ఏనుగుల విషయంలో మీ అభిప్రాయం మారడం ఖాయం. గ్వాటెమాలా నగరంలోని జూలో ఒక అసాధారణ ఘటన జరిగింది. ఇది చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు.

ఒక చిన్న గజెల్ (చిక్కటి జింకలా జీవి) జూ లోపలున్న లోతైన నీటి కొలనిలో పడిపోయింది. అది బయటపడేందుకు ఎంతగా కష్టపడినా... బయటకు రాలేకపోతోంది. నీటిలో కొట్టుకుంటూ ప్రాణాలు పోయే పరిస్థితిలో పడింది.
అప్పుడే ఎవ్వరి ఊహకి అందని విధంగా, అక్కడే ఉన్న ఒక భారీ ఏనుగు నెమ్మదిగా నీటికి దగ్గరగా వచ్చింది. తన తొండాన్ని ఆ జింక వైపు చాపింది. చాలా జాగ్రత్తగా ఆ జింకను తన తొండంతో పట్టుకుని నెమ్మదిగా బయటకు లాగింది.
ఆ తర్వాత ఆ జింకను నేలపై మెల్లగా ఉంచింది. ఇది చూసిన సందర్శకులు ఒక్కసారి ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఏనుగు అనగానే భయపడతాం కానీ దానిలో కూడా ఎంత గొప్ప హృదయం దాగి ఉందో చూడండి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జంతువులే అలా సాయం చేసుకుంటుంటే మనుషులు మాత్రం ఒకరిని మరొకరు తొక్కేయాలని చూస్తున్నారు అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.