Viral Video: ఇదేం వాడకం సామీ.. అలేఖ్య చిట్టి పికెల్స్‌పై స్పందించిన ట్రంప్‌.. వైరల్‌ వీడియో

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న అంశం ఏదైనా ఉందంటే అది అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియో వివాదమే.

Update: 2025-04-05 08:20 GMT

Viral Video: ఇదేం వాడకం సామీ.. అలేఖ్య చిట్టి పికెల్స్‌పై స్పందించిన ట్రంప్‌.. వైరల్‌ వీడియో 

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న అంశం ఏదైనా ఉందంటే అది అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియో వివాదమే. కస్టమర్ పచ్చళ్ల ధరల గురించి అడిగినందుకు, తగినట్టు స్పందించకుండా తీవ్రంగా అవమానించారనే ఆరోపణలతో ఈ వ్యవహారం ముదిరిపోయింది. బూతులతో రెచ్చిపోయిన ఆడియో వైరల్ కావడంతో నెటిజన్లు సీరియస్‌గా స్పందిస్తున్నారు.

అలేఖ్య వీడియోల్లో "కస్టమర్లే మా దేవుళ్లు" అంటారు కానీ, ఆచరణలో అందుకు భిన్నంగా ప్రవర్తించారనే విమర్శలు వస్తున్నాయి. ఎంత ఎదిగినా వినమ్రత అవసరమేనని, ఓపిక కోల్పోతే ముదిరిన పేరు క్షణాల్లో కూలిపోతుందనే సందేశాన్ని పలువురు పంచుకుంటున్నారు. ఈ కాంట్రవర్సీపై సోషల్ మీడియా మొత్తం మీమ్స్‌తో హోరెత్తిపోతోంది. అలేఖ్య పికిల్స్ కొనాలంటే బ్యాంక్ లోన్ తీసుకోవాల్సిందేనంటూ ఫన్నీ మీమ్స్ పెడుతూ నెటిజన్లు తమ క్రియేటివిటీ చూపిస్తున్నారు.

తాజాగా డొనాల్డ్ ట్రంప్ను ఈ వివాదంలోకి లాగుతూ ఒక ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. అందులో ట్రంప్ "అలేఖ్య చిట్టి పికెల్స్ బాయ్‌కాట్ చేయండి. కస్టమర్‌ను అవమానించడం చాలా బాధాకరం. ఈ సంఘటన నుంచి వారు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను" అని చెబుతున్నట్లు చూపించారు. వీడియో పూర్తిగా మీమర్స్ సృష్టించిన హాస్య సృష్టి అయినప్పటికీ, ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో నవ్వుకుంటున్నారు. అలేఖ్య పికిల్స్‌ వ్యవహారం ఏమో కానీ మీమర్స్‌ చేతి నిండి పని దొరికింది. అదే విధంగా సోషల్‌ మీడియా యూజర్లకు ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లభిస్తోంది. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ ట్రంప్‌ వీడియో సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 


Tags:    

Similar News