Viral Video : పాము నోటికే పంజా విసిరిన శునకం..చెట్టు మీద యుద్ధం చూస్తే వెన్నులో వణుకు ఖాయం

నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించే మాయాజాలం అంతా ఇంతా కాదు. ఇంటర్నెట్‌లో మనం చూసే వీడియోల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో కనిపెట్టడం తలకి మించిన భారంగా మారుతోంది.

Update: 2026-01-05 09:30 GMT

Viral Video : పాము నోటికే పంజా విసిరిన శునకం..చెట్టు మీద యుద్ధం చూస్తే వెన్నులో వణుకు ఖాయం

Viral Video : నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించే మాయాజాలం అంతా ఇంతా కాదు. ఇంటర్నెట్‌లో మనం చూసే వీడియోల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో కనిపెట్టడం తలకి మించిన భారంగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక భయంకరమైన వీడియో వైరల్ అవుతోంది. చెట్టుపై ఉన్న ఒక భారీ కింగ్ కోబ్రా మీద కుక్కల గుంపు దాడి చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇది చూస్తుంటే ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది. కానీ, అసలు నిజం తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక భారీ కింగ్ కోబ్రా చెట్టుపై పడగ విప్పి భీకరంగా కనిపిస్తుంది. దానిని చూడగానే మూడు కుక్కలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. సాధారణంగా పామును చూడగానే ఏ జంతువైనా భయపడుతుంది, కానీ ఈ కుక్కలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఒక కుక్క ఏకంగా ఆ కోబ్రా తోక పట్టుకుని కిందకు లాగేయగా, మరో కుక్క నేరుగా దాని నోటిపైనే దాడికి దిగింది. ఈ దృశ్యం చూస్తున్నంత సేపు గుండె ఆగినంత పనవుతుంది. కేవలం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.



మొదటి చూపులో ఇది పక్కా నిజమైన వీడియోలా అనిపిస్తుంది. పాము పడగ విప్పడం, దాని శరీరంపై ఉండే పొలుసులు, కుక్కల కదలికలు అన్నీ చాలా సహజంగా ఉన్నాయి. అయితే, లోతుగా గమనిస్తే ఇది AI సాయంతో సృష్టించిన వీడియో అని స్పష్టమవుతోంది. ఇలాంటి ప్రమాదకరమైన పోరాటం ప్రకృతిలో సాధ్యమే అయినప్పటికీ, ఈ వీడియోలోని లైటింగ్, కొన్ని కదలికలు ఏఐ మ్యాజిక్ అని నిరూపిస్తున్నాయి. టెక్నాలజీ ఎంతగా ఎదిగిపోయిందంటే, కళ్ల ముందే కనిపిస్తున్నా అది అబద్ధం అని నమ్మలేనంతగా ఈ వీడియోను రూపొందించారు.

ఎక్స్ లో @NatureNexus4321 అనే ఐడీ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకు 5 లక్షల 26 వేల మందికి పైగా వీక్షించారు. వేల సంఖ్యలో లైకులు, వందలాది కామెంట్లు వస్తున్నాయి. ఏఐ గనుక కుక్కలు ఏదైనా చేయగలవు అని ఒకరు జోక్ చేయగా, పాము కరిచి ఉంటే ఆ కుక్కలు బతికేవి కావు, ఇది కచ్చితంగా ఫేక్ అని మరొకరు కామెంట్ చేశారు. టెక్నాలజీ ఇంతలా పెరగడం వల్ల భవిష్యత్తులో నిజమైన వార్తలను గుర్తించడం కష్టమవుతుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News