Traffic Rules: బైక్‌ నడుపుతూ ఈ తప్పులు చేయవద్దు.. చలాన్‌ భారీగా ఉంటుంది జాగ్రత్త..!

Traffic Rules: బైక్‌ రైడర్లు తరచుగా ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘిస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. దీనివల్ల వారు ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులని కూడా ఇందులోకి లాగుతారు.

Update: 2023-08-04 14:00 GMT

Traffic Rules: బైక్‌ నడుపుతూ ఈ తప్పులు చేయవద్దు.. చలాన్‌ భారీగా ఉంటుంది జాగ్రత్త..!

Traffic Rules: బైక్‌ రైడర్లు తరచుగా ట్రాఫిక్‌ రూల్స్ ఉల్లంఘిస్తారు. ఇది చాలా పెద్ద తప్పు. దీనివల్ల వారు ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులని కూడా ఇందులోకి లాగుతారు. అందుకే ప్రతి ఒక్కరు ట్రాఫిక్‌రూల్స్ పాటించాలి. దీనివల్ల జీవితం సురక్షితంగా ఉంటుంది. ప్రమాద అవకాశాలని తగ్గిస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించి మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలి. ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చూడాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీసుల మీదే ఉంటుంది. అందుకే నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు. భారీగా చలాన్‌లు విధిస్తారు. అయితే ఎలాంటి తప్పులకి చలాన్‌ వేస్తారో ఈరోజు తెలుసుకుందాం.

హెల్మెట్ లేకుంటే

హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్ట విరుద్ధం. ఇలా చేయడం వల్ల చలాన్ జారీ చేస్తారు. దాదాపు రూ.1000 నుంచి మొదలవుతుంది. పోలీసులు వెంటనే ఆ ద్విచక్రవాహనాలను ఆపివేస్తారు. అందుకే బైక్ నడుపుతున్నప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలని గుర్తుంచుకోండి.

బైక్‌పై ట్రిపుల్ రైడ్‌

బైక్‌పై ట్రిపుల్‌ రైడ్‌ చట్టవిరుద్ధం. ఇది ప్రమాదాలకి దారితీస్తుంది. బైక్ ముగ్గురు వ్యక్తులు ప్రయాణించేలా తయారుచేయలేదు. ఇది చాలా ప్రమాదకరం. అందుకే పోలీసులు చలాన్ వేస్తారు.

అతివేగం

అతివేగం ప్రాణాంతకంగా మారుతుంది. ఇది పెద్ద ప్రమాదాలకి కారణమవుతుంది. దీని ఫలితంగా తీవ్రమైన గాయాలు, మరణం కూడా సంభవించవచ్చు. కాబట్టి ఎల్లప్పుడూ తక్కువ వేగంతో వాహనాన్ని నడపాలి. సురక్షితంగా డ్రైవ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఓవర్ స్పీడ్ బైక్‌లను పోలీసులు వెంటనే ఆపి చలాన్ వేస్తారు.

నంబర్ ప్లేట్

మోటార్ సైకిల్ నంబర్ ప్లేట్ మార్చినా.. బైక్ కొనుగోలు చేసే సమయంలో వచ్చిన నంబర్ ప్లేట్ కాకుండా వేరే నంబర్ ప్లేట్ అమర్చినా.. పోలీసులు బైక్ ఆపి చలాన్‌ వేస్తారు. అంతేకాకుండా కొన్నిసార్లు క్రిమినల్‌ కేసులు కూడా నమోదుచేస్తారు.

Tags:    

Similar News