Viral Video : ప్రాణం పోయినంత పని..లైకుల పిచ్చితో బైక్ మీద విన్యాసాలు..ఆఖరికి ఏమైందో చూడండి
Viral Video : నేటి కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి యువత ప్రాణాల మీదకు తెస్తోంది. కేవలం కొన్ని లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఆస్పత్రి పాలవుతున్నారు.
Viral Video : ప్రాణం పోయినంత పని..లైకుల పిచ్చితో బైక్ మీద విన్యాసాలు..ఆఖరికి ఏమైందో చూడండి
Viral Video : నేటి కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి యువత ప్రాణాల మీదకు తెస్తోంది. కేవలం కొన్ని లైకులు, వ్యూస్ కోసం ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన స్టంట్లు చేస్తూ ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా ఒక యువకుడు బైక్ మీద నిలబడి విన్యాసాలు చేయబోయి, రోడ్డు మీద దారుణంగా పడిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు అతివేగంతో బైక్ నడుపుతూ, అకస్మాత్తుగా దాని సీటు మీద నిలబడి స్టంట్ చేయడం ప్రారంభించాడు. అయితే, గాలి వేగానికి ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పడంతో ఆ యువకుడు రోడ్డు మీద ఎగిరి పడ్డాడు. కదులుతున్న బైక్ మీద నుంచి నేరుగా తారు రోడ్డుపై పడటంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతను కింద పడగానే బైక్ కూడా నియంత్రణ కోల్పోయి చాలా దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది. కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోకుండా ఇలాంటి విన్యాసాలు చేయడం చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ప్రమాదం చూస్తుంటే ఆ యువకుడు బతికే అవకాశం లేదనిపిస్తుంది. కానీ అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పిందని సమాచారం. రోడ్డు మీద ఇలాంటి పనులు చేయడం వల్ల కేవలం మన ప్రాణాలే కాదు, ఎదురుగా వచ్చే అమాయకుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో @Ansari_Shams_ అనే ఐడి నుంచి షేర్ చేసిన ఈ వీడియోకు "రోడ్డు మీద చేసే తప్పులకు క్షమాపణలు ఉండవు.. ఒక చిన్న స్టంట్ మిమ్మల్ని నేరుగా ఆస్పత్రికో లేదా స్మశానానికో చేరుస్తుంది" అనే క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను చూశారు.
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "ఒక్క లైక్ కోసం జీవితాన్ని పణంగా పెట్టడం తెలివైన పని కాదు" అని ఒకరు కామెంట్ చేయగా, "ఇలాంటి వారికి తగిన శాస్తి జరిగింది, ఇప్పుడు గానీ బుద్ధి రాదు" అని మరొకరు మండిపడ్డారు. రోడ్డుపై జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడమే అసలైన హీరోగిరి అని, ఇలాంటి వెర్రి చేష్టలతో తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చవద్దని ఈ వీడియో సందేశాన్ని ఇస్తోంది.