Coronavirus New Symptoms: కొత్త దారుల్లో కరోనా పయనం.. కొత్త లక్షణాలు ఇవే!

Coronavirus New Symptoms: కరోనా వ్యాప్తిని అరికట్టలేని పరిస్థితికి వచ్చామనే చెప్పాలి.

Update: 2020-07-08 05:30 GMT
Women And Child Welfare Office Employees Tested Corona Positive (rep image)

Coronavirus New Symptoms: కరోనా వ్యాప్తిని అరికట్టలేని పరిస్థితికి వచ్చామనే చెప్పాలి. ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో, ఇది సోకిన వారికి ఎటువంటి లక్షణాలు ఉంటాయో తెలియని పరిస్థితికి వచ్చింది. ఇప్పటివరకు ఉన్న వాటితో పాటు కొత్త లక్షణాలు చోటు చేసుకుంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ లక్షణల విషయంలో రోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కరోనా వైరస్‌ రూటు మార్చింది. ఎవరూ అంచనా వేయని విధంగా కొత్త దార్లలో వెళుతోంది. వైరస్‌ వ్యాపిస్తోన్న కొద్దీ పాజిటివ్‌ పేషెంట్లలో పలు రకాల లక్షణాలు బయటికొస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గడిచిన పక్షం రోజులుగా కొత్తరకం కరోనా లక్షణాలు బయటికొస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నిర్ధారించిన వాటికి భిన్నంగా ఏ లక్షణాలుంటే కరోనా పాజిటివ్‌ అనుకోవాలో అర్థం కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా కొందరికి ఇన్ఫెక్షన్‌ రేటు ఎక్కువగా ఉండటం, మరికొందరిలో లక్షణాలున్నా నెగిటివ్‌ రావడం చోటుచేసుకుంటోంది. తాజా పరిస్థితులను అంచనా వేసి, వాటికి పరిష్కార మార్గాలు కనుగొనడంలో డబ్ల్యూహెచ్‌ఓ, ఐసీఎంఆర్‌ మరింతగా కసరత్తు చేస్తున్నాయి.

ఇప్పటి వరకు కరోనా లక్షణాలు ఇలా...

► దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోలేక పోవడం..

► కళ్లలో తేడాలుంటే పాజిటివ్‌గా నిర్ధారణ చేసుకోవడం

► శరీరం బలహీనంగా అనిపించడం, అలసట.. గొంతు తడారినట్టుగా ఉండి, విపరీతంగా పొడిదగ్గు.. ఊపిరితిత్తుల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం

► శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ శాతాన్ని కుచించుకుపోయేలా చేయడం

► కొంతమందిలో ఇన్ఫెక్షన్‌ ఉన్నా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం

కొత్త కరోనా లక్షణాలు ఇలా..

► కడుపులో వికారంగా ఉండటం

► విపరీతంగా నీళ్ల విరేచనాలు

► రోజులో ఐదారుసార్లు పైనే వాంతులు

► కడుపు ఉబ్బరం

► ఆహారం అరగకపోవడం

► చర్మంపై దద్దుర్లు... ఇవి రోజు రోజుకూ తీవ్రమవడం హా అరికాళ్లలో తిమ్మిర్లు

► మూర్ఛ, నత్తిగా మాట్లాడటం..

కొత్త లక్షణాలకు వైద్యుల సూచనలు:

► ఆకుకూరలు, కూరగాయల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం

► ఎక్కువగా మంచినీళ్లు తాగడం..పళ్లను తీసుకోవడం.. యోగా లేదా ప్రాణాయామం చేయడం

► టాయ్‌లెట్‌లను వైరస్‌ను నియంత్రించే రసాయనాలతో శుభ్రం చేయడం

► ఇంట్లో రెండు లేదా మూడు టాయ్‌లెట్‌లు ఉంటే కొంతమంది లెక్కన వాటిని వాడటం. 

Tags:    

Similar News