Corona virus precautions by ICMR: స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్ష..ఐసిఎంఆర్ సూచనలు!

Corona virus precautions by ICMR: కరోనా మహమ్మారి ఎంతకూ మనల్ని వదలడం లేదు సరికదా..మరింతగా రెచ్చిపోతోంది. అతి వేగంగా విస్తరిస్తూ వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి చాలావరకూ భయాన్ని కలిగిస్తూనే ఉంది.

Update: 2020-06-27 07:55 GMT

కరోనా మహమ్మారి ఎంతకూ మనల్ని వదలడం లేదు సరికదా..మరింతగా రెచ్చిపోతోంది. అతి వేగంగా విస్తరిస్తూ వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి చాలావరకూ భయాన్ని కలిగిస్తూనే ఉంది. బయటకు వెళ్లి ఎదో పని చేసుకోకపోతే జీవితం గడవదు. బయటకు వెళితే జీవితం ఉంటుందా? అనే అనుమానం. మానసికంగా కూడా మనిషి నలిగిపోతున్నాడు.

ఎప్పటికి ఈ పరిస్థితులు మారుతాయో తెలీని స్థితి. కరోనాతో యద్ధం చేయాలంటే మందులూ మాకులూ కాదు.. జాగ్రత్తలే అతిముఖ్యం అనేది సుస్పష్టం. అందుకే మనం ఎలా ఉండాలో ఒకటికి పదిసార్లు ప్రభుత్వ అధికారులు.. డాక్టర్లు చెబుతున్నారు. కచ్చితంగా మనం పాటించే జాగ్రత్తలే మన జీవితాన్ని కాపాడతాయి. ఇందులో సందేహం లేదు. కరోనా వస్తుందేమో అనే అతి భయం.. కరోనా మనకు రాదులే నిర్లక్ష్యం రెండూ పనిచేయవు. ఎవరూ దేనికీ అతీతులు కారు. అందులోనూ కరోనాకి.. కరోనా వైరస్ కి నిర్లక్ష్యంగా ఉండే వారంటే మరింత ఇష్టం. అందుకే మళ్ళీ ఐసీఎంఆర్‌ కోవిద్‌-19 ను ఎదుర్కోవడానికి మరిన్ని సూచనలు చేసింది .ఇవన్నీ మొదట్నుంచీ చెబుతున్నవే. కానీ, పరస్థితి అదుపు తప్పుతున్న ఈ సమయంలో మరోసారి ప్రజలకు తమ జీవితాల పట్ల తాము తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతోంది ఐసీఎంఆర్! అవేమిటో మీకోసం..

- రెండేళ్ల వరకూ విదేశీ ప్రయాణాలు మానుకోవాలి

- ఏడాది పాటు బయటి ఆహారం ముట్టుకోవద్దు

- పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లకపోవడమే మంచిది

- అనవసరమైన విహారయాత్రలకు దూరంగా ఉండాలి

- జన సమూహం, గుంపులు గుంపులుగా ఉన్నచోటకు ఏడాది పాటు వెళ్లొద్దు

- భౌత్రిక దూరం పాటించాల్సిందే

- దగ్గుతో బాధపడుతున్న వారి నుంచి దూరంగా ఉండాలి

- నిత్యం మాస్కు ధరించాల్సిందే

- వచ్చే వారం రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలి

- మీ సమీపంలోని ఆహారశాలలకు దూరంగా ఉండండి

- శాఖాహారం భుజించేందుకే ప్రాముఖ్యత ఇవ్వండి

- సినిమాలు, మాల్స్‌, జనసమూహం ఉన్న చోట్లకు వెళ్లొద్దు, వీలైనంతవరకు

- పార్కులు, పార్టీలకు ఆర్నెళ్లపాటు దూరంగా ఉండాలి.

- ర్రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి.

- సెలూన్లు, స్పాలకు దూరంగా ఉంటే మంచిది.

- సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలి. భౌతిక దూరాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

- అతి తొందర్లోనే కరోనా నుంచి విముక్తి ఉంటుందని భావించొద్దు.

- బయటకు వెళ్లేటప్పుడు బెల్టు ధరించడం, ఉంగరాలు తొడుక్కోవడం, వాచీలు పెట్టుకోవడం మానేయాలి. సెల్‌ఫోన్లోనే సమయం చూసుకోవచ్చు

- చేతి రుమాలు వాడొద్దు. శానిటైజర్‌, టిష్యూ పేపర్‌ దగ్గరుంచుకోవాలి

- చెప్పులు, షూలు ఇంట్లోకి తీసుకు రావద్దు. బయటే వాటిని ఉంచాలి

- బయటి నుంచి వచ్చేటప్పుడు విధిగా చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవాలి.

- అనుమానిత రోగులు మీకు సమీపంలో ఉన్నారని తెలిసేటప్పుడు తొందరగా

స్నానం చేయడం మంచిది.

- లాక్‌డౌన్‌ ఉన్నా లేకున్నా ఆర్నెళ్ల నుంచి ఏడాది పాటు జాగ్రత్తగా ఉండడమే మంచిది. 

Tags:    

Similar News