Coronavirus Effect: కరోనా వైరస్ మళ్లీ మళ్లీ సోకే అవకాశం!

Coronavirus Effect: మనిషి శరీరంలో వ్యాపించిన కరోనా వైరస్ ను అంతం చేయడానికి శరీరంలోని యాంటీబాడీలు కీలకంగా పని చేస్తున్నాయి.

Update: 2020-07-14 13:30 GMT
Representational Image

Coronavirus Effect: మనిషి శరీరంలో వ్యాపించిన కరోనా వైరస్ ను అంతం చేయడానికి శరీరంలోని యాంటీబాడీలు కీలకంగా పని చేస్తున్నాయి. శరీరంలో వైరస్‌కి ధీటైన యాంటీబాడీలు తయారవుతున్నాయి. అయితే మనిషిని కాపాడడానికి ఎంతగానో పనిచేస్తున్న యాంటీబాడీల కొన్ని నెలల్లోనే తగ్గిపోతున్నట్లు లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ కరోనా వైరస్ సాధారణ జలుబులాగానే మళ్లీ మళ్లీ సోకే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కొంత కాలానికే యాంటీ బాడీలు తగ్గి, వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతున్నాయి అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ కేటీ డూరెస్ తెలిపారు.

ఇప్పటి వరకు కరోనా వైరస్ వ్యాప్తి చెందిన వారిలో 65 మందిపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. ఇకపోతే కరోనా వైరస్ ని  ఎదుర్కునేందుకు మనిషికి వ్యాధి నిరోధక శక్తి చాలా కీలకం. కానీ యాంటీబాడీలు వైరస్‌తో పోరాటం చేసిమూడు నెలల్లోనే తగ్గిపోతున్నాయంటే వ్యాక్సిన్లు కూడా అంతే అనుకోవచ్చు. ఇలాంటి వారికి వ్యాక్సిన్ ఒక్కసారి వేస్తే సరిపోదు అందుకే వారికి వ్యాక్సిన్ మళ్లీ వేయాల్సిన అవసరం ఉండొచ్చు అని కేటీ అన్నారు. అయితే దేశంలోని చాలా మంది యువత ఎక్కువ మందికి కరోనా సోకితే సామూహిక నిరోధక వస్తుందని చాలా కరోనాను అంటించుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా వారు మాత్రమే కాక ఇతర ప్రజలను కూడా ప్రమాదంలో పడేస్తారు" అని హెచ్చరించారు. 


Tags:    

Similar News