షాపింగ్ కోసం వెళ్లిన మహిళ.. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో కోటీశ్వరాలైంది..!
ఒక్క క్షణంలో ఎవరో కోటీశ్వరుడు అయ్యాడని వింటే అది సినిమా కథలా అనిపిస్తుంది. కానీ నిజ జీవితంలో అలాంటి అదృష్టం చైనాలోని ఓ మహిళను వరించింది. ఇంటి సరుకులు కొనడానికి మార్కెట్‌కి వెళ్లిన ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది.

మార్కెట్‌లో షాపింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో ఆమె సమీపంలోని ఒక దుకాణంలోకి వెళ్లింది. అది లాటరీ షాప్ కావడంతో టైమ్‌పాస్ కోసం ఒక బుక్‌లెట్ స్క్రాచ్ కార్డులు కొనుగోలు చేసింది. ఒక్కో టికెట్ ధర 30 యువాన్లు (దాదాపు రూ.250). మొత్తం 30 టికెట్లు తీసుకోవడంతో రూ.12,500 వరకు ఖర్చు చేసింది.
అయితే, ఆరవ టికెట్ స్క్రాచ్ చేసిన క్షణంలోనే ఆమె అదృష్టం వెలుగొందింది. ఆ టికెట్‌పై ఆమె 10 లక్షల యువాన్లు (సుమారు రూ.1.4 కోట్లు / US $140,000) గెలుచుకుంది. ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తం గెలిచినందుకు ఆమె ఆశ్చర్యంతో ఆనందభాష్పాలు పెట్టుకుంది.
యునాన్ ప్రావిన్స్‌లోని యుక్సీ ప్రాంతానికి చెందిన ఈ మహిళ మాట్లాడుతూ, "ఇలాంటిదీ జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు" అని సంతోషం వ్యక్తం చేసింది.