Chanakya Niti: భార్యకున్న ఈ అలవాటు భర్తకు నరకం లాంటిది..!
Chanakya Niti: చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన జీవితాలకు ఉపయోగపడే విషయాల గురించి మాత్రమే కాకుండా, భార్యాభర్తల మధ్య సంబంధం గురించి కూడా వివరించాడు.
Chanakya Niti: భార్యకున్న ఈ అలవాటు భర్తకు నరకం లాంటిది..!
Chanakya Niti: చాణక్య నీతి: ఆచార్య చాణక్యుడు భారతదేశంలోని గొప్ప పండితులలో ఒకరు. ఆయన బోధించిన సూత్రాలు నేటికీ మనకు ఉపయోగకరంగా ఉన్నాయి. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో మన జీవితాలకు ఉపయోగపడే విషయాల గురించి మాత్రమే కాకుండా, భార్యాభర్తల మధ్య సంబంధం గురించి కూడా వివరించాడు. ముఖ్యంగా ఈ లక్షణాలు ఉన్న స్త్రీని వివాహం చేసుకుంటే, మీ జీవితం నరకం అవుతుందని తెలిపాడు.
కోపం
చాలా కోపంగా ఉన్న భార్యతో భర్త జీవితం నరకం కంటే దారుణంగా ఉంటుందని చాణక్య చెబుతున్నాడు. ఎందుకంటే వారు ప్రతి చిన్న విషయానికి గొడవపడి నిరాశకు గురవుతారు. దీనితో విసిగిపోయిన భర్త భార్యను దూరం పెడతాడు. అంతటితో ఆగకుండా వేరే స్త్రీకి దగ్గరవుతాడు. కానీ ఇదంతా జరిగినా కూడా, భార్య స్వభావంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి, కోపం ఎక్కువగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది.
అనుమానం
ప్రతిదానినీ అనుమానించే భార్య ఉంటే భర్త జీవితం దుర్భరంగా మారుతుందని చాణక్యుడు వివరించాడు. ప్రతిదానినీ అనుమానించే భార్యతో భర్త సంతోషంగా ఉండలేడు. భార్యకున్న ఈ అలవాటు ఆమె భర్తకు మరణం లాంటి బాధను కలిగిస్తుంది. దీని వల్ల ఇద్దరు విడాకులు కూడా తీసుకోవచ్చు.
అతి ఖర్చు
భార్యలలో అతి పెద్ద చెడు అలవాటు అతిగా ఖర్చు చేయడం. అలాంటి వ్యక్తులు తమ జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు. ఎందుకంటే భార్య అతి ఖర్చులు భర్తను అప్పుల్లోకి నెట్టివేస్తాయి.
సోమరితనం
కొంతమంది స్త్రీలు పుట్టుకతోనే సోమరితనం కలిగి ఉంటారు. వివాహం తర్వాత కూడా కొంతమంది స్త్రీలు ఈ పద్దతిని మార్చుకోరు. దీని వల్ల తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. భార్యకున్న ఈ అలవాటు భర్తపైనే కాకుండా మొత్తం కుటుంబంపై కూడా ఒత్తిడిని కలిగిస్తుంది.