Caught On Camera: మసీదు ముందు ఎలుకల్ని వదిలి వెళ్లిన 66 ఏళ్ల వ్యక్తి.. కట్ చేస్తే
Caught On Camera: యుకెలోని షెప్టీల్డ్ అనే ఒక మసీదు ముందు ఒక 66ఏళ్ల వ్యక్తి కారు ఆపి డిక్కీలోంచి ఒక్కొక్క ఎలుకను తీసి రోడ్డుపక్కన వదులుతుంటాడు.
Caught On Camera: మసీదు ముందు ఎలుకల్ని వదిలి వెళ్లిన 66 ఏళ్ల వ్యక్తి.. కట్ చేస్తే
Caught On Camera: ఎవరిపైన అయినా కోపం వస్తే వాళ్ల ఇంటి ముందు చెత్త వేయడం లేతంటే ఉమ్మ వేయడం మన సాధారణంగా చూస్తుంటాం. కానీ ఈ వ్యక్తి ఏకంగా ఎలుకలని వదిలాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు ఒక మసీదు ముందు ఎలుకలని వదిలి వెళ్ళాడు. వివరాల్లోకి వెళితే..
యుకెలోని షెప్టీల్డ్ అనే ఒక మసీదు ముందు ఒక 66ఏళ్ల వ్యక్తి కారు ఆపి డిక్కీలోంచి ఒక్కొక్క ఎలుకను తీసి రోడ్డుపక్కన వదులుతుంటాడు. అయితే ఇలా ఎలుకల్ని వదలడం పెద్ద నేరమేమీ కాదు కానీ ఒక మసీదు ముందు వదలి పైగా జాత్యహంకార నినాదాలు చేయడం నేరమే కదా. అందుకే కోర్టుకూడా అతన్ని బాగా తిట్టిపోసింది. అసలు ఈ వ్యక్తి ఇక్కడ ఎలుకల్ని ఎందుకు వదిలాడో తెలుసుకుందాం.
గత నెల మే, జూన్ మధ్య నాలుగు సార్లు ఎడ్మండ్ ఫౌలర్ అనే వ్యక్తి ఈ చర్యలకు పాల్బడ్డాడు. తన కారు డిక్కీలో బోనులో ఉన్న ఎలుకలను తీసి మసీదు ముందు విడిచిపెట్టాడు. అంతేకాదు మసీదులోకి వెళ్లే వారిపై జాతి అహంకారపు నినాదాలు చేశాడు. విచిత్రం ఏంటంటే.. ఈ వ్యక్తి తన ఈ పనిచేసేముందు ఒక వీడియోను రికార్డ్ చేసుకున్నాడు. ఇందులో అతను ఎలుకలతో.. మీరు ఎక్కడకు వెళుతున్నారో ఊహించండి. సరైన చోటుకే మిమ్మల్ని పంపుతాను అని అంటాడు.
ఇదిలా ఉంటే ఎడ్మంట్ ఇలా మసీదు ముందుకొచ్చి ఎలుకలను వదలడం కూడా సీసీటీవీ ఫుటేస్‌లో రికార్డ్ అవుతుంది. దీన్ని ఆ మసీదుకు చెందిన మేనేజర్ కోర్టులో ప్రెజెంట్ చేసాడు. అతని నినాదాలతో మసీదుకు వచ్చేవాళ్లు ఇబ్బంది పడుతున్నారని కోర్టుకు విన్నవించుకున్నాడు. ఎడ్మంట్ కూడా తన నేరాన్ని ఒప్పుకుంటాడు. దీంతో కోర్టు ఇది అసహ్యకరమైన, అమానుషమైన చర్య అని అంటూ ఎడ్మంట్‌ని తిట్టిపోసింది. అయితే అతనికి శిక్ష ఏమీ విధించలేదు. కానీ ఒక 18 వారాల పాటు ఏ మసీదు లేదా షెఫీల్డ్ లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లకూడదని నిషేధం విధించారు.