Traffic Rules: ట్రాఫిక్‌ పోలీసులు కారు తీసుకెళ్లారా.. తిరిగి ఎలా పొందాలో తెలుసుకోండి..!

Traffic Rules: మెట్రో నగరాలు, పట్టణాలల్లో జనాభా విపరీతంగా ఉండడం వల్ల తరచూ ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతుంది.

Update: 2024-02-06 13:00 GMT

Traffic Rules: ట్రాఫిక్‌ పోలీసులు కారు తీసుకెళ్లారా.. తిరిగి ఎలా పొందాలో తెలుసుకోండి..!

Traffic Rules: మెట్రో నగరాలు, పట్టణాలల్లో జనాభా విపరీతంగా ఉండడం వల్ల తరచూ ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతుంది. రోడ్ల పక్కన పెద్ద పెద్ద కాంప్లెక్స్‌లు, బిల్డింగ్‌లు ఉండడం వల్ల వాహనాల పార్కింగ్‌కు స్థల సమస్య ఏర్పడుతుంది. కొన్నిసార్లు కార్లు, బైక్‌లు రోడ్లపైనే పార్కింగ్‌ చేసి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల ట్రాఫిక్‌ పోలీసులు మీ వాహనాన్ని పీఎస్‌కు తీసుకెళుతారు లేదా ఫైన్‌ వేస్తారు. ఒకవేళ పోలీసులు వాహనాన్ని తీసుకువెళ్లినట్లయితే ఎలా విడిపించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

పోలీసుల మీ వాహనాన్ని ఇష్టారీతిన తీసుకెళ్లి డ్యామేజ్‌ చేసినట్లయితే ఆ నష్టానికి అయ్యే ఖర్చును పోలీసులే భరించాల్సి ఉంటుంది. ఒకవేళ కారు పాడైపోయి క్లెయిమ్ తీసుకోవాలను కుంటే కోర్టును ఆశ్రయించవలసి ఉంటుంది. పోలీసులు నో పార్కింగ్ స్థలం నుంచి కారును పోలీసు స్టేషన్‌కు లేదా నిర్దేశించిన ఇతర ప్రదేశానికి తీసుకువెళతారు. అప్పుడు పోలీసు కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి కారు ఎక్కడికి తీసుకెళ్లారని అడగవచ్చు. లేదా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి అడగవచ్చు.

కారు ఎందుకు తీసుకెళుతారు..?

తప్పు పార్కింగ్‌తో సహా అనేక కారణాల వల్ల పోలీసులు కార్లను తీసుకెళుతారు. నో పార్కింగ్ జోన్‌లో కారును పార్క్ చేస్తే లేదా కారును ఏదైనా నేర కార్యకలాపాలకు ఉపయోగిస్తే తీసుకెళుతారు. ఇలాంటి సమయంలో ముందుగా కారు తీసుకెళ్లిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలి.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News