Viral News: రెస్టారెంట్ బిల్ కోటి రూపాయలా? బంగారం తిన్నారా ఏమో అన్నట్టుంది!
బయటకు వెళ్లి రెస్టారెంట్‌లో తినడం చాలా మందికి అలవాటు. అప్పుడప్పుడు కుటుంబం, స్నేహితులు, బంధువులతో కలిసి రుచికరమైన వంటకాలు, ఫేవరెట్ డ్రింక్స్ ఆర్డర్ చేసి ఆ హ్యాపీ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తారు.
Viral News: రెస్టారెంట్ బిల్ కోటి రూపాయలా? బంగారం తిన్నారా ఏమో అన్నట్టుంది!
కేన్స్ (ఫ్రాన్స్): బయటకు వెళ్లి రెస్టారెంట్‌లో తినడం చాలా మందికి అలవాటు. అప్పుడప్పుడు కుటుంబం, స్నేహితులు, బంధువులతో కలిసి రుచికరమైన వంటకాలు, ఫేవరెట్ డ్రింక్స్ ఆర్డర్ చేసి ఆ హ్యాపీ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తారు. సాధారణంగా రెస్టారెంట్‌లో ఒక డిన్నర్‌కు కొన్ని వేల నుంచి, పెద్ద హోటల్ అయితే పదివేల నుంచి ఇరవై వేల వరకు బిల్లు వస్తుంది. కానీ కేన్స్‌లోని ఓ ఫేమస్ రెస్టారెంట్ ఇచ్చిన బిల్లు చూసి అందరూ షాక్ అవుతున్నారు.
ఒక్క రోజు డిన్నర్ బిల్ ఏకంగా రూ. కోటి!
ఫ్రెంచ్ రివేరా ప్రాంతంలోని లా మోమ్ అనే రెస్టారెంట్‌లో ఆరుగురు ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్నారు. బీచ్ వద్ద కూర్చొని ఫుడ్, డ్రింక్స్ ఎంజాయ్ చేశారు. ఆ ఒక్క రాత్రి బిల్లు మొత్తం $116,500 (భారత కరెన్సీలో రూ. 1,02,31,171). ఇందులో ఫుడ్ ఖర్చు సుమారు రూ. 19 లక్షలు కాగా, ఆల్కహాల్ ఖర్చు మరో రూ. 17 లక్షలు. ముఖ్యంగా ఖరీదైన షాంపైన్ బాటిళ్లు కూడా ఆర్డర్ చేశారు. సర్వీస్ ఛార్జీలు కలిపి మొత్తం రూ. కోటి బిల్లు పడింది. ఈ బిల్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో నెట్టింట హల్‌చల్ అవుతోంది.
నెటిజన్ల రియాక్షన్:
“ఒకే రాత్రి డిన్నర్‌కి కోటి రూపాయల బిల్లు అంటే పిచ్చిగా ఖర్చు పెట్టారన్నమాట” అని ఒకరు కామెంట్ చేశారు.
“ఈ డబ్బుతో మూడు నాలుగు మధ్యతరగతి కుటుంబాలు జీవితాంతం సుఖంగా బతుకుతాయి” అని మరొకరు రాశారు.
“ఇంత ఖర్చు పెట్టింది చూస్తుంటే రేపు ప్రపంచం అంతం కాబోతుందన్నట్టుంది” అని ఓ నెటిజన్ ఫన్ చేశారు.
మొత్తానికి ఈ బిల్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.