Viral Video: ఏ మాత్రం అటు, ఇటైనా ప‌చ్చ‌డి అయ్యే వాడు.. షాకింగ్ వీడియో

Viral Video: వన్యప్రాణులు జ‌నాల మ‌ధ్య‌కు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. మ‌రీ ముఖ్యంగా ఇటీవ‌ల ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పులులు, సింహాలు వంటివి మాత్ర‌మే కాకుండా ఏనుగులు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి వ‌స్తున్నాయి.

Update: 2025-05-11 11:30 GMT

Viral Video: ఏ మాత్రం అటు, ఇటైనా ప‌చ్చ‌డి అయ్యే వాడు.. షాకింగ్ వీడియో

Viral Video: వన్యప్రాణులు జ‌నాల మ‌ధ్య‌కు రావ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. మ‌రీ ముఖ్యంగా ఇటీవ‌ల ఇది ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. పులులు, సింహాలు వంటివి మాత్ర‌మే కాకుండా ఏనుగులు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి వ‌స్తున్నాయి. సోష‌ల్ మీడియా విస్తృతి పెరిగిన ప్ర‌స్తుత త‌రుణంలో వీటికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా ఇలాంటి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ ఏంటా వీడియో.? అందులో ఏముందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. నోలన్ సామ్‌యూర్ అనే కంటెంట్ క్రియేటర్, ఒంటారియో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతానికి చెందినవారు. ఆయన భారత్‌లోని అడవిలో స్కూటర్‌పై ప్రయాణిస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

వీడియో ప్రారంభంలో అతను ఒక భారీ ఏనుగును మార్గం మధ్య నిలబడి చూసి, సరదాగా "ఏంటి సర్, రోడ్డుపై ఇలా రిలాక్స్ అవుతున్నారు?" అని అడుగుతాడు. అప్పటివరకు ఏనుగు నిశ్శబ్దంగా ఉంది. అయితే కొద్ది సేప‌టికే మరొక స్కూటర్‌పై వచ్చిన వ్యక్తి కొన్ని మీటర్ల దూరంలో ఆగిపోవడంతో, ఏనుగు అకస్మాత్తుగా అతని వైపు పరుగెత్తింది.

ఆయన వెంటనే స్కూటర్ తిప్పి అక్కడినుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. దీనంత‌టినీ అంత‌కు ముందు ఏనుగు నుంచి త‌ప్పించుకున్న వ్య‌క్తి త‌న ఫోన్‌లో చిత్రీక‌రించాడు. ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ఆ వీడియో తెగ వైర‌ల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. ఏమాత్రం అటు, ఇటైనా ప‌చ్చ‌డి అయ్యేవాడు అంటూ కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ‌రికొంద‌రు స్పందిస్తూ.. మ‌నోడి ఆయుష్షు గ‌ట్టిగా ఉందని స్పందిస్తున్నారు. నెట్టింట వైర‌ల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. 



Tags:    

Similar News