Photo Puzzle: మీ బ్రెయిన్ పవర్‌కు ఓ పరీక్ష... ఈ ఫోటోలో తప్పును కనిపెట్టగలరా?
Photo Puzzles: పజిల్స్... వీటిని సాల్వ్ చేయడంలో ఉండే కిక్కే వేరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం టైమ్‌పాస్‌కు మాత్రమే కాకుండా మెదడుకు సైతం మేత పెడుతుంటాయి. ఇప్పుడంటే ఈ వీడియో గేమ్స్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కానీ ఒకప్పుడు మాత్రం ఇలాంటి ఫొటో పజిల్స్‌కు పెద్ద ఎత్తున ఆదరణ ఉండేది. సండే మ్యాగజైన్స్‌తో పాటు ప్రత్యేకంగా ఇలాంటి ఫొటోలతో కూడిన బుక్స్ లభించేవి.
సండే వచ్చిందంటే చాలు ఈ పజిల్స్‌ను సాల్వ్ చేసేందుకు పోటీ పడుతుంటారు. అయితే సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటో పజిల్స్ అక్కడ కూడా వైరల్ అవుతున్నాయి. ప్రత్యేకంగా పేజీలను క్రియేట్ చేసి మరీ కొందరు వీటిని వైరల్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఓ ఫొటోనే నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో అందులో ఉన్న విశేషం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది. ఏముంది ఓ వ్యక్తి హాల్‌లో టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు ఉంది కదూ! ఇంకా గమనిస్తే అ్కడ రెండు పిల్లులు ఉన్నాయి. అంతే కదూ! అయితే ఇందులో ఓ తప్పు ఉంది. ఆ తప్పును కనిపెట్టడమే ఆ పజిల్ ముఖ్య ఉద్దేశం. అయితే ఇదేదో చిన్న తప్పు కాదు, పెద్ద తప్పే. 10 సెకండ్లలో ఆ తప్పును గుర్తిస్తే మీ ఐ పవర్‌తో పాటు థింకింగ్ పవర్ కూడా సూపర్ అని అర్థం. ఇంతకీ ఆ తప్పు ఏంటో కనిపెట్టారా? ఎంత ప్రయత్నించినా తప్పు కనిపించడం లేదా?
అయితే ఓసారి తీక్షణంగా గమనించండి తప్పు ఇట్టే కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా ఆ తప్పు కనిపించడం లేదా? అయితే ఓసారి ఆ వ్యక్తి ముందు ఉన్న టేబుల్‌ను జాగ్రత్తగా గమనించండి. అందులో ఆ తప్పు దాగి ఉంది. ఇపాటికే మీ తప్పు ఏంటో ఓ క్లారిటీ వచ్చేసే ఉంటుంది.
అవును టేబుల్‌కు 4 కాళ్లు ఉండాల్సింది కేవలం 3 మాత్రమే ఉన్నాయి. అదే ఈ ఫొటోలో ఉన్న మిస్టేక్.