Viral News: గర్ల్‌ఫ్రెండ్‌ను ఎత్తుకుని హాస్పిటల్‌కు తీసుకొచ్చిన యువకుడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే షాక్..
Viral News: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక విషాదకర ఘటన వెలుగు చూసింది.
Viral News: గర్ల్‌ఫ్రెండ్‌ను ఎత్తుకుని హాస్పిటల్‌కు తీసుకొచ్చిన యువకుడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే షాక్..
Viral News: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఒక విషాదకర ఘటన వెలుగు చూసింది. మూడు సంవత్సరాలుగా సహజీవనం చేస్తూ ఒకే ఇంట్లో నివసిస్తున్న ప్రేమజంట జీవితంలో విషాదం చోటుచేసుకుంది. వివాహం కాకుండానే కలిసి జీవిస్తున్న ఈ జంటకు అనుకోని ప్రమాదం ఎదురైంది. మంగళవారం ఓ యువతికి ఏదో విషపూరిత కీటకం కాటు వేసింది. దీంతో ఆమె సహజీవన భాగస్వామి చేతన్ కుక్రేజా హుటాహుటిన ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు.
ఆటోలో వాచ్‌మెన్ సహాయంతో హాస్పిటల్‌కి వచ్చిన చేతన్, యువతిని తన చేతుల మీదగా ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లాడు. అయితే ఆసుపత్రిలో ఆమెను జాయిన్ చేసే సమయంలో తన అసలైన పేరును వెల్లడించకుండా నకిలీ పేరుతో నమోదు చేశాడు. ఆమె ఆరోగ్యం క్షీణించుతుండటాన్ని గమనించిన చేతన్ అక్కడినుంచి పరారయ్యాడు. బాధితురాలు చికిత్స పొందుతూ అక్కడే మరణించింది.
ఆమె మృతితో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి ఆటో నెంబర్ ఆధారంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. చనిపోయిన యువతికి బాయ్‌ఫ్రెండ్‌నే కారణమని గుర్తించిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటన ప్రేమలో ఉన్న యువతులు, యువకులకు అప్రమత్తత అవసరమనే విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తోంది.