జంతువులకూ రక్తమార్పిడి..ప్రాణం పోస్తున్నడాక్టర్లు!

Update: 2021-01-10 10:02 GMT

Blood Transfusion for a dog

ఒక ప్రాణి జీవనానికి ఎంతో ముఖ్యమైనది రక్తం. ఏ ప్రాణి కూడా రక్తం లేనిది జీవించలేదు. ప్రాణాపాయ సమయాల్లో మనుషులకు రక్తం ఎక్కించి బతికిస్తారు. అలాగే జంతువులకు కూడా రక్తం ఎక్కిస్తున్నారు డాక్టర్లు. ముఖ్యంగా కుక్కలకు రక్త మార్పిడి చేసి ప్రాణాలు కాపాడుతున్నారు.

అనీమియా వ్యాధి సాధారణంగా జంతువుల్లో వస్తుంది. ఈ వ్యాధి సోకినప్పుడు రక్త మార్పిడి అవసరం అవుతుంది. రక్తం లభించక కుక్కలు, పిల్లులు చనిపోతాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు తీవ్ర గాయాలై రక్తం దొరక్క మరణిస్తాయి. ఈ మధ్య కాలంలో ప్రాణపాయ సమయాల్లో మనుషుల మాదిరిగా కుక్కలను కూడా రక్తదానంతో వెటర్నరీ డాక్టర్లు బతికిస్తున్నారు.

మనుషుల మాదిరిగానే జంతువుల్లోనూ బ్లడ్ గ్రూపులు ఉంటాయి. ఏదైనా జంతువుకు రక్తం అవసరం ఉన్నప్పుడు మరో జంతువు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, దాని బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవుతుందా లేదా అనే విషయాన్ని వెటర్నరీ డాక్టర్లు పరిశీలించి, సిఫార్సు చేస్తారు.

మనుషుల తరహాలోనే కొన్ని కుక్కలకు డెలివరీ సమయంలో రక్త హీనత సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాంటి సందర్భం లో కూడా రక్తం ఎక్కిస్తూ ఉంటారు. మనం చూస్తున్న ఈ కుక్క కు సిజేరియన్ డెలివరీ చేసేటప్పుడు రక్తం ఎక్కించారు డాక్టర్లు.

జంతువుల రక్తదాననికి యాజమానులు ప్రోత్సహించి సాటి జంతువుల ప్రాణాలు కాపాడాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. మూగజీవుల ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావాలని డాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News