Snake Bite: పాముని పట్టుకోడానికి వచ్చి.. ఆ పాముకే బలైపోయాడు..వైరల్ వీడియో
Snake Bite: ఒక్కొక్కసారి తెలిసి ప్రమాదంలో పడిపోతుంటారు చాలామంది. ప్రమాదం ఎప్పుడూ ప్రమాదమేనన్న సంగతి వారికి గుర్తుండదు. ఇదిగో ఇక్కడ కూడా అదే జరిగింది. అతను పాములు పట్టే ఎక్స్ పర్ట్.
Snake Bite: పాముని పట్టుకోడానికి వచ్చి.. ఆ పాముకే బలైపోయాడు..వైరల్ వీడియో
Snake Bite: ఒక్కొక్కసారి తెలిసి ప్రమాదంలో పడిపోతుంటారు చాలామంది. ప్రమాదం ఎప్పుడూ ప్రమాదమేనన్న సంగతి వారికి గుర్తుండదు. ఇదిగో ఇక్కడ కూడా అదే జరిగింది. అతను పాములు పట్టే ఎక్స్ పర్ట్. పామును కూడా తెలివిగా పట్టాడు. కానీ దాంతో ఆడుతున్నాడు. చుట్టూ జనం ఆ ఆటను చూస్తున్నారు. కట్ చేస్తే ఆ పాము వెనక్కి తిరిగి అతని చేయిని కొరికింది. అతను బాధతో గిలగిలలాడుతున్నా.. జనం ముందుకు రాలేదు. సాయం చేయలేదు... వివరాల్లోకి వెళితే..
బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. సికిందర్ బజార్‌లోని ఒక గిడ్డంగిలో విషపూరితమైన పాము కనిపించిందని, దాన్ని పట్టుకోడానికి రావాలని అక్కడున్న వాళ్లు పాములు పట్టే నిపుణుడు అయిన జెపి గెహున్మాన్ యాదవ్‌ను పిలిచారు. ఎలా అయితే అతను గిడ్డంగిలోపలికి వెళ్లి పామను పట్టాడు. దాన్ని బయటకు తీసుకొచ్చాడు. చుట్టూ జనం గుమిగూడి ఆ పామును వింతగా, గెహున్మాన్‌ని హోరాగా చూస్తున్నారు. ఇక కాసేపు దాంతో ఆటలాడదాం అనుకున్ని కిందకూర్చుని మరీ దాంతో ఆడుతున్నాడు. పాము చాలాసార్లు కాటేయాలని ప్రయత్నించింది..కానీ అతను తెలివిగా దాన్ని హ్యాండిల్ చేస్తుండంతో జనం అంతా భలే బావుంది.. అంటూ చూడసాగారు.
అయితే కాసేపు అలానే ఆడిన తర్వాత ఆ పాము ఒక్కసారిగా వెనక్కి తిరిగి అతని వేలిపై కాటేసింది. ఆ తర్వాత అతను మందు కోసం పిలుస్తున్నాడు. తన మణికట్టుని కట్టమని కూడా వేడుకుంటున్నాడు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. పాము అతన్ని కరిచిన తర్వాత అతను పామును పట్టుకునే ఉన్నాడు. ఇక చివరగా ఆ పాముని ఒక డబ్బాలోకి వేశాడు. ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయాడు.
చుట్టూ జనం ఉన్నారు. అసలు ఆ పామును పట్టమని పిలిపించిన వాళ్లు కూడా అతన్ని కాపాడులేకపోయారు. సాయం చేయలేకపోయారు. విచిత్రం ఏంటంటే దగ్గరలో పోలీసులు కూడా ఉన్నారు. ఎవరూ పట్టించుకోలేదు. అయితే స్పృహ తప్పి పడిపోవడంతో అతని హాస్పిటల్‌లో చేర్చారు. ఆ తర్వాత విషం శరీరమంతా పాకేయడంతో అతను ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు.
ఇప్పటివరకు గెహున్మాన్ వందల పాములను పట్టి ఉంటాడు. దీనికి సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. పాములను చాలా తెలివిగా పడతాడు. అటువంటిది చివరకు ఆ పాము కాటుకి బలైపోయాడు. అందుకే ప్రమాదం అన్నది ఎప్పుడూ ప్రమాదమే. ఆ ప్రమాదంతో జాగ్రత్తగా వ్యవహరించాలే తప్ప వేలకోలం ఆడకూడదు.