Viral Video: ఈ పిల్ల ఏనుగు కుర్చిలో కూర్చోడానికి ఎంత ట్రై చేసిందో..వైరల్ వీడియో
Viral Video: ఈ మధ్యకాలంలో ఏనుగు పిల్లల చేష్టలు బాగా వైరల్ అవుతున్నాయి. కొన్ని డిసిప్లెయిన్‌తో ఉంటే మరికొన్ని అమ్మ చెప్పినట్టు నడుచుకుంటున్నాయి.
Viral Video: ఈ పిల్ల ఏనుగు కుర్చిలో కూర్చోడానికి ఎంత ట్రై చేసిందో..వైరల్ వీడియో
Viral Video: ఈ మధ్యకాలంలో ఏనుగు పిల్లల చేష్టలు బాగా వైరల్ అవుతున్నాయి. కొన్ని డిసిప్లెయిన్‌తో ఉంటే మరికొన్ని అమ్మ చెప్పినట్టు నడుచుకుంటున్నాయి. మరికొన్ని అయితే నాటీగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఒక చిన్న ఏనుగు పిల్ల కుర్చీ కనబడగానే పరుగెత్తుకొచ్చి అందులో కూర్చోవాలని చూస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
ఏనుగు పిల్లల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే వాటి చేష్టలు అందరినీ భలే ఆకట్టుకుంటున్నాయి. ముద్దు ముద్దుగా చేస్తున్న వీటి చిలిపి పనులు అందరినీ ఫిదా చేస్తున్నాయి. అలాంటి ఘటనే ఇది. ఒక ప్రాంతంలో మడత పెట్టే కుర్చీలు వరుసగా వేసి ఉంటాయి. అయితే మరి ఎక్కడనుంచి ఈ కుర్చీలను చూసిందో ఏమో ఒక గున్న ఏనుగు పరుగు పరుగున అక్కడకు వచ్చి ఆ కుర్చీలో కూర్చోడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి.
కుర్చీ చిన్నది, గున్న ఏనుగు దానికంటే పెద్దది. మరి ఆ కుర్చీలో ఈ గున్న ఏనుగు ఎలా సరిపోతుంది. సరిపోదు కదా. కానీ ఈ విషయం ఆ ఏనుగు పిల్లకు తెలియక ఎంత సేపు కుర్చీలో కూర్చోవాలని తెగ ఆరాటపడుతుంది. ఆరాటపడడమే కాదు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. మొదటిసారి కుర్చీలో కూర్చుందామని ప్రయత్నించినప్పుడు అసలు సరిపోదు. దీంతో డైరెక్షన్ మార్చి మళ్లీ కూర్చోవాలని చూస్తుంది అయినా సరిపోదు. అలా కొంచెం గట్టిగా ప్రయత్నించినప్పటికి కుర్చీ ఫోల్డింగ్ అయిపోతుంది. దీంతో అది కిందపడిపోతుంది. ఎంత విచిత్రం అంటే.. ఈ గున్న ఏనుగు కుర్చీ కిందకు పడిపోయినా కూడా దాన్ని పట్టుదల ఆపలేదు. అయినా కూడా అందులో కూర్చోవాలనే చాలా తపన పడింది.
ఇలా చాలా సేపు గున్న ఏనుగు కుర్చీలో కూర్చోడానికి ప్రయత్నించింది. కానీ ఫలితం లేదు. చివరకు కింద పడిపోయిన కుర్చీని ఇష్టమొచ్చినట్టు తన్నేసి తన కోపాన్ని తీర్చుకుంది. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ముద్దుగా.. బొద్దుగా నాటీ పనులు చేస్తున్న గున్న ఏనుగునను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.