Watch Video: కన్న పిల్లల కర్కశత్వం.. వృద్ధ తల్లిని నడిరోడ్డుపై వదిలేసిన వైనం

Watch Video: ఉత్తర ప్రదేశ్‌లో హృదయ విదారకం సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అయోధ్య నగరానికి దగ్గరలో ఉన్న కిషన్ దాస్ పూర్‌‌లో వృద్ధురాలైన తల్లిని రోడ్డు పక్కన పడుకోబెట్టి పిల్లలు వెళ్లిపోయారు.

Update: 2025-07-26 00:45 GMT

Watch Video: కన్న పిల్లల కర్కశత్వం.. వృద్ధ తల్లిని నడిరోడ్డుపై వదిలేసిన వైనం

Watch Video: ఉత్తర ప్రదేశ్‌లో హృదయ విదారకం సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అయోధ్య నగరానికి దగ్గరలో ఉన్న కిషన్ దాస్ పూర్‌‌లో వృద్ధురాలైన తల్లిని రోడ్డు పక్కన పడుకోబెట్టి పిల్లలు వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక ఘటన సీసీటీవీ ఫుడేస్‌లో రికార్డ్ అయింది. వివరాల్లోకి వెళితే..

మానవత్వం మంటగలిసిపోతుంది.. నవమాసాలు మోసి, కని, పెంచిన తల్లి పెద్దయ్యాక బరువైపోతుంది. తన తల్లి పండు ముసలదన్న దయ లేదు. రోడ్డుపక్కన వదిలేసి వెళ్లిపోతే ఆమె ఏమైపోతుందోనన్న జాలి లేదు. అత్యంత దారుణంగా.. కర్కశంగా పిల్లలు వృద్దురాలైన తల్లిన రోడ్డుపక్కన వదిలేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని కిషన్ దాస్ పూర్‌‌లో జరిగింది.

ఒక వ్యక్తి, ఒక మహిళ.. వీరిద్దరూ ఏదో ఒక మూటను మోసుకొచ్చి రోడ్డుపక్కన వదిలేస్తారు. ఆ మూట కదులుతూ ఉంటుంది. తీరా చూస్తే అందులో ఒక పెద్దామె ఉంటుంది. ఆమె చేతులు పైకి లేపుతుంటుంది. అయితే మోసుకొచ్చిన మహిళ మళ్లీ వెనక్కి వచ్చి ఆమె ముఖం మీద వరకు దుప్పటి కప్పి వెళ్లిపోతుంది. మరో మహిళ వచ్చి ఆ దుప్పటిని కాస్త తీసి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఆ పెద్దామె చేతులు పైకి లేపి కదుపుతూ ఉంటుంది. సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరినీ ఇప్పుడు కదలించివేస్తున్నాయి. కర్కశంగా కుటుంబ సభ్యులు ఇలా వృద్దురాలైన తల్లిని రోడ్డుపక్కన వదిలేసి పోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.




Tags:    

Similar News