Aura Farming: చిన్నోడీ స్టెప్స్‌కు ప్రపంచమే ఫిదా!
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వైరల్ డ్యాన్స్ ట్రెండ్ – "ఆరా ఫార్మింగ్"!
Aura Farming: చిన్నోడీ స్టెప్స్‌కు ప్రపంచమే ఫిదా!
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న వైరల్ డ్యాన్స్ ట్రెండ్ – "ఆరా ఫార్మింగ్"!
పడవ స్పీడ్‌కి సరిపడేలా చూపించిన డ్యాన్స్ స్టెప్స్ ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యాయి. 11 ఏళ్ల ఇండోనేషియా బాలుడు రేయాన్ అక్రన్ చేసిన ఈ "బోట్ డ్యాన్స్" ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది.
ఈ ట్రెండ్‌లో ఇప్పుడు సింగపూర్ నేవీ సిబ్బంది నుంచి మన ముంబై పోలీసులు వరకూ పాల్గొనడం విశేషం.
ముంబై పోలీసుల బోట్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో, ఈ ట్రెండ్ అసలు ఎలా మొదలైందో తెలుసుకోని నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రముఖులు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు కూడా ఈ మ్యూజిక్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ తమ వీడియోలు షేర్ చేస్తున్నారు.
కదులుతున్న కారు మీద స్టంటే ట్రబుల్‌కు దారి తీసింది
నవీ ముంబైలోని ఖార్ఘర్‌లో 24 ఏళ్ల నజ్మీన్ సుల్దే, కదులుతున్న మెర్సిడెస్ బెంజ్ కారు బానెట్‌పై బూట్లు లేకుండా ఆరా ఫార్మింగ్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో, పోలీసులు స్పందించి చర్యలు తీసుకున్నారు.
నజ్మీన్‌తో పాటు ఆ కారు నడిపిన ఆమె బాయ్‌ఫ్రెండ్ అల్-ఫెష్ షేక్ పై కేసు నమోదు చేశారు.
భారతీయ న్యాయసంహిత (BNS) మరియు మోటారు వాహన చట్టం ప్రకారం, ఇతర ప్రయాణికుల భద్రతను ఉల్లంఘించినందుకు ఇద్దరినీ అరెస్టు చేశారు. అంతేకాక, అల్-ఫెష్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం మరో గొడవకు దారి తీసింది.
వైరల్‌ను ఫాలో అవ్వాలంటే బాధ్యత కూడా గుర్తుంచుకోవాలి అంటున్నారు నెటిజన్లు!