Marriage Dates: పెళ్లి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారా.. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఇవే..!

Marriage Dates: కొత్తగాపెళ్లి సంబంధాలు చూసేవారు, మాటా, ముచ్చట అయిపోయి ముహుర్తం కోసం ఎదురుచూసేవారు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి.

Update: 2024-03-26 14:30 GMT

Marriage Dates: పెళ్లి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారా.. ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఇవే..!

Marriage Dates: కొత్తగాపెళ్లి సంబంధాలు చూసేవారు, మాటా, ముచ్చట అయిపోయి ముహుర్తం కోసం ఎదురుచూసేవారు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాలి. మార్చి 14న సూర్యుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడంతో ఖర్మాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 13న ఖర్మమాసం ముగుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏప్రిల్ 13 తర్వాతే ఏ శుభకార్యమైనా చేయాలి. ఖర్మల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

2024 సంవత్సరంలో శుభ ముహూర్తాలు

ఏప్రిల్‌లో వివాహానికి 10 రోజులు అనుకూలంగా ఉన్నాయి. అవి 18, 19, 20, 21, 22, 23,24, 25, 26, 28. జూలైలో వివాహానికి మొత్తం 9 రోజులు శుభప్రదంగా ఉన్నాయి. 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. నవంబర్‌లో వివాహానికి 7 రోజులు శుభప్రదంగా ఉన్నాయి. 17, 18, 22, 23, 24, 25, 26. డిసెంబ ర్ లో 9 రోజులు వివాహానికి అనుకూలంగా ఉన్నాయి. 2, 3, 4, 5, 9, 10, 11, 13, 15.

ఖర్మలలో శుభకార్యాలు చేయవద్దు..

హిందూ సంప్రదాయం ప్రకారం.. ఖర్మాలు శుభమైనవిగా పరిగణించరు. ఈ సమయంలో శుభ కార్యాలు చేయడం నిషేధం. ప్రతియేడు ఖర్మాలు 30 రోజులు కొనసాగుతాయి. ఈ సమయంలో గృహ ప్రవేశం, కొత్త వాహనం కొనుగోలు, భూమి, వివాహం, ముండ, పవిత్ర దారం, అన్నప్రాసన, కొత్త పనులు ప్రారంభించడం వంటి పనులు చేయకూడదు.

Tags:    

Similar News